‘అంటే.. సుందరానికీ’.. నాని కెరీర్‌లోనే టాప్!

ABN , First Publish Date - 2022-04-22T00:48:03+05:30 IST

నేచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా వివేత్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే.. సుందరానికీ’. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ ఇప్పుడు మిలియన్ల కొద్దీ వ్యూస్

‘అంటే.. సుందరానికీ’.. నాని కెరీర్‌లోనే టాప్!

నేచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా వివేత్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే.. సుందరానికీ’. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ ఇప్పుడు మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ.. నాని కెరీర్‌లోనే 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. నాని నుంచి వినోదాత్మక చిత్రాలు ఆశించే ప్రేక్షకులకు సుందరం పాత్ర కావలసినంత వినోదం పంచుతుందనే భరోసా ఈ టీజర్ ఇచ్చింది. వివేక్ ఆత్రేయ తనదైన శైలిలో తెరకెక్కించిన ఈ సినిమా టీజర్‌.. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ స్పందనతో కేవలం 24 గంటల్లో టీజర్‌కు 11 మిలియన్ల వ్యూస్ దక్కాయి. నాని కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ వన్ డే రికార్డ్. యూట్యూబ్‌లో ఇప్పటికీ టాప్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ టీజర్‌కి 366కె+ లైక్స్ వచ్చాయి. టీజర్‌కి వస్తున్న వ్యూస్, లైక్స్‌తో చిత్రయూనిట్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.


ఈ టీజర్‌లో.. క్రిస్టియన్ అమ్మాయి నజ్రియా ప్రేమలో పడ్డ బ్రాహ్మణ కుర్రాడిలా నాని విభిన్న పాత్రలో కనిపించారు. టీజర్‌లో లవ్ ట్రాక్ చాలా కొత్తగా, ఫ్రెష్ అండ్ ప్లజంట్‌గా అనిపించింది. టీజర్ మొత్తం నవ్వులు పూయిస్తూనే టైటిల్‌లో వున్న ‘అంటే..’కి సమాధానం ప్రేక్షకుడి గెస్సింగ్‌కి వదిలి ఆసక్తిని పెంచగా, కథలో మరో కీలకమైన అంశం వుందని హింట్ ఇచ్చేలా టీజర్‌ను డిజైన్ చేశారు. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా, నికేష్ బొమ్మి సినిమాటోగ్రఫర్‌గా, రవితేజ గిరిజాల ఎడిటర్‌గా పని చేస్తున్నారు. జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.



Updated Date - 2022-04-22T00:48:03+05:30 IST