Nani : క్రేజీ దర్శకుడితో సినిమా?

ABN , First Publish Date - 2022-05-23T14:00:22+05:30 IST

నేచురల్ స్టార్ నానీ (Nani) గత చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singharoy) ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ ఓ రేంజ్‌లో వసూళ్ళు రాబట్టింది. బెంగాలీ బ్యాక్‌డ్రాప్‌లో నానీ పోషించిన పాత్రకు మంచి అప్లాజ్ లభించింది. తదుపరిగా నానీ నటిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ ‘అంటే సుందరానికీ’ (Ante Sundarainikee). వివేక్ ఆత్రేయ (Vivek Atreya) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Nani : క్రేజీ దర్శకుడితో సినిమా?

నేచురల్ స్టార్ నానీ (Nani) గత చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singharoy) ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ ఓ రేంజ్‌లో వసూళ్ళు రాబట్టింది. బెంగాలీ బ్యాక్‌డ్రాప్‌లో నానీ పోషించిన పాత్రకు మంచి అప్లాజ్ లభించింది. తదుపరిగా నానీ నటిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ ‘అంటే సుందరానికీ’ (Ante Sundarainikee). వివేక్ ఆత్రేయ (Vivek Atreya) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక దీని తర్వాత నానీ నటిస్తున్న మాస్ యాక్షన్ చిత్రం ‘దసరా’ (Dasara). శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో రూపొందుతోంది. ఇందులోని నానీ మేకోవర్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. నానీ ఓ క్రేజీ దర్శకుడితో సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఒక రకంగా ఇదొక షాకింగ్ కాంబినేషన్ అని చెప్పాలి. 


ఎవరూ ఊహించని ఆ సినిమా దర్శకుడు మరెవరో కాదు.. ‘కేజీఎఫ్’ (KGF) సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు రేపిన ప్రశాంత్ నీల్ (Prashanth neel). ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్’ (Salaar) మూవీ తెరకెక్కిస్తున్న ప్రశాంత్.. NTR 31వ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. వీటి తర్వాత అతడు తీయబోతున్న మరో పాన్ ఇండియా చిత్రానికి నానీ(Nani) ని హీరోగా ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ సినిమాని కూడా హోంబలే ఫిల్మ్స్ వారే నిర్మించబోతున్నారు. ఈ వార్తలో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  


‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singharoy) చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అలరించిన నానీ (Nani).. తదుపరి చిత్రం ‘దసరా’ (Dasara) కూడా పాన్ ఇండియా కేటగిరిలోనే విడుదల కాబోతోంది. అందుకే నానీ ఇకపై నటించేవి అన్నీ పాన్ ఇండియా చిత్రాలే అయి ఉండాలనుకుంటున్నాడట. అందుకే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం రానుందని వార్తలొస్తున్నాయి. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్ళు కురిపించే ప్రశాంత్ నీల్ (Prashanth neel) నానీని ఈ సినిమాతో బడా స్టార్‌ను చేస్తాడని వేరే చెప్పాలా? మరి నానీ - ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. 

Updated Date - 2022-05-23T14:00:22+05:30 IST