రాయల్‌ లుక్‌లో నందమూరి హీరో!

ABN , First Publish Date - 2022-05-29T07:04:55+05:30 IST

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌ శత జయంతి సంవత్సరం సందర్భంగా ఆయన మనవడు కల్యాణ్‌రామ్‌ నటిస్తూ నిర్మిస్తున్న ‘బింబిసార’ చిత్రం పోస్టర్‌ను...

రాయల్‌ లుక్‌లో నందమూరి హీరో!

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌ శత జయంతి సంవత్సరం సందర్భంగా ఆయన మనవడు కల్యాణ్‌రామ్‌ నటిస్తూ నిర్మిస్తున్న ‘బింబిసార’ చిత్రం పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కల్యాణ్‌రామ్‌ రెండు విభిన్న గెటప్స్‌లో కనిపిస్తున్నారు. ఆ రెండు లుక్స్‌లో ఆయన రాయల్‌గా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన మగధ రాజు బింబిసారుడిగా కనిపించనున్నారు. ‘ఏ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌’ అనేది ఈ చిత్రం ట్యాగ్‌లైన్‌. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంతో వశిస్ట్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో చిత్రం ఉంది.  భారీ సెట్స్‌తో  కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని   ఆగస్ట్‌ 5న విడుదల చేయడానికి నిర్మాత కె.హరికృష్ణ సన్నాహాలు చేస్తున్నారు. 


Updated Date - 2022-05-29T07:04:55+05:30 IST