NBK: బాలకృష్ణ వస్తేగాని ఏది డిసైడ్ అవ్వదు

ABN , First Publish Date - 2022-09-20T17:57:35+05:30 IST

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఆన్‌స్టాపబుల్ (Unstoppable) రెండో సీజన్ (second season) వస్తోంది..

NBK: బాలకృష్ణ వస్తేగాని ఏది డిసైడ్ అవ్వదు

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్‌స్టాపబుల్ (Unstoppable) రెండో సీజన్ (second season) వస్తోంది అని ప్రకటించగానే దాని మీద ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. ఎవరు ఆ షోకి అతిథులుగా వస్తారు, ఈసారి ఎలా చేస్తారు అనే విషయం మీద. ఆ షో నిర్వాహకులు ఈ షో గురించి ప్రకటించిన వాళ్లు కూడా బాలకృష్ణ వచ్చేంత వరకు ఎదురు చూడాలి. ప్రస్తుతం బాలకృష్ణ టర్కీ (Turkey)లో మలినేని గోపీచంద్ (Malineni Gopichand) సినిమా షూటింగ్ చేస్తూ చాలా బిజీగా వున్నారు. అతను వచ్చిన తరువాతనే షోలో ఎవరు అతిథులు అనేది  నిర్ణయిస్తారు అని షో నిర్వహిస్తున్న సభ్యుల్లో ఒకరు చెప్పారు.


అలాగే ఈ షోలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan), త్రివిక్రమ్ (Trivikram Srinivas) వస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అది కూడా నిర్థారణ కాలేదు అని చెప్పారు. ఈసారి షో కూడా ఒక ప్రత్యేకత ఉండటానికి మొదటి సీజన్‌లాగా కాకుండా.. ఇంకా ఆసక్తికరంగా చెయ్యడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి బాలకృష్ణ కూడా తన సినిమా షూటింగ్ మధ్యలో వచ్చి ఈ షో చెయ్యాలి కాబట్టి.. ఎలా ఉంటుంది, అతని షెడ్యూల్స్ ప్రకారం నిర్వాహకులు అతిథులను పిలవాలి. అప్పుడు వాళ్లు కూడా ఫ్రీగా ఉండాలి. ఇవన్నీ చూసుకొని చెయ్యాలి అని చెప్పారు. బాలకృష్ణతో ఒక్కసారి మాట్లాడితే అన్నీ వాటంతట అవే డిసైడ్ అయిపోతుందని అనుకుంటున్నారు. కానీ ప్రారంభం మాత్రం ఒక పెద్ద స్టార్‌తో ఉండొచ్చని అన్నారు.

Updated Date - 2022-09-20T17:57:35+05:30 IST