NBK-Koratala: కాంబినేషన్ సెట్ అయ్యిందా? నిర్మాత అతనేనా?

ABN , First Publish Date - 2022-10-07T15:51:19+05:30 IST

‘అఖండ’ (Akhanda) వంటి బ్లాక్‌బస్టర్, ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable) వంటి రోరింగ్ టాక్‌ షోలతో దూసుకుపోతున్న నందమూరి నటసింహం బాలకృష్ణ..

NBK-Koratala: కాంబినేషన్ సెట్ అయ్యిందా? నిర్మాత అతనేనా?

‘అఖండ’ (Akhanda) వంటి బ్లాక్‌బస్టర్, ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable) వంటి రోరింగ్ టాక్‌ షోలతో దూసుకుపోతున్న నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Natasimham Balakrishna).. ప్రస్తుతం గోపీచంద్ మలినేని (Gopichand Malineni)తో NBK107, అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో NBK108 చిత్రాలను ఓకే చేసిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేనితో చేసే చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే అనిల్ రావిపూడి చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఈ రెండు చిత్రాలే కాకుండా.. మరో సెన్సేషనల్ కాంబినేషన్‌లో బాలయ్య (Balayya) చిత్రం ఓకే అయినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాని నిర్మించబోయేది ఎవరో కాదు.. యంగ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) అని అంటున్నారు.


ఇటీవల ‘స్వాతిముత్యం’ (Swathimuthyam) చిత్ర ప్రమోషన్స్‌లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. తమ బ్యానర్‌లో భవిష్యత్‌లో ఎవరెవరితో సినిమాలు చేయబోతున్నాడో తెలిపాడు. అందులో బాలయ్య పేరు కూడా మెన్షన్ చేశాడు. ఆయన ఎప్పుడైతే బాలయ్య పేరు చెప్పాడో.. ఇక నెటిజన్లు డైరెక్టర్‌ని సెట్ చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా వచ్చిందో.. లేదంటే నిర్మాతల సైడ్ నుంచే ఏదైనా లీక్ అయిందో తెలియదు కానీ.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (Sithara Entertainments)లో బాలయ్య-కొరటాల కాంబినేషన్‌ (Balayya and Koratala Combo)లో త్వరలో సినిమా అంటూ తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. 


ఇక కొరటాల శివ (Koratala Siva) విషయానికి వస్తే.. ‘ఆచార్య’ (Acharya) తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (Young Tiger NTR)తో చేయబోతున్న చిత్రం విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ‘NTR30’గా తెరకెక్కాల్సిన ఈ చిత్రం.. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. అందుకు కారణాలు అనేకం వినిపిస్తున్నా.. మేకర్స్ మాత్రం ఈ సినిమాపై సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. ఎన్టీఆర్‌ (NTR)తో ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలయ్య-కొరటాల సినిమా పట్టాలెక్కనుందని, ఈలోపు బాలయ్య కమిటైన రెండు చిత్రాలను ఫినిష్ చేసి రెడీగా ఉంటాడనేలా టాక్ వినబడుతోంది. మరి ఈ వార్తలపై నిర్మాత నాగవంశీ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి.   

Updated Date - 2022-10-07T15:51:19+05:30 IST