Namrata shirodkar: అత్త జ్ఞాపకాలతో భావోద్వేగ పోస్ట్‌!

ABN , First Publish Date - 2022-10-01T00:58:18+05:30 IST

సీనియర్‌ నటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ భార్య, హీరో మహేష్‌ బాబు తల్లి ఇందిరాదేవి బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Namrata shirodkar: అత్త జ్ఞాపకాలతో భావోద్వేగ పోస్ట్‌!

సీనియర్‌ నటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ (Krishna) భార్య, హీరో మహేష్‌ బాబు తల్లి ఇందిరాదేవి బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సినీ రాజకీయ ప్రముఖులు ఇందిరా దేవికి నివాళులు అర్పించి, కృష్ణ, మహేశ్‌లను పరామర్శించారు. ఇందిరా దేవి తనకు అత్త అయినా అమ్మగా  భావించే నమ్రతా (Namrata shirodkar)ఇందిర (Indira devi)మరణం పట్ల ఓ ఫొటో షేర్‌ చేసి భావోద్వేగ పోస్ట్‌ చేశారు. ‘‘మేము మిమ్మల్ని ఎంతగానో మిస్‌ అవుతున్నాం. అనుక్షణం మీతో ఉన్న మధు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఉంటాం. మీరు నాకు పంచిన ప్రేమను నేను మన కుటుంబ సభ్యులు, మీ అబ్బాయి మీద, మీ మనవల మీద చూపిస్తాను. అంతు లేని ప్రేమను, వెలుగును మాకు ప్రసాదించారు. వీ లవ్‌ యూ మమ్మీ’’ అని నమ్రత పేర్కొన్నారు. నమ్రత శిరోద్కర్‌ అత్తపై చేసిన పోస్ట్‌ చేసి నెటిజన్లు కన్నీరు మున్నీరవుతున్నారు. కామెంట్లతో నమ్రతకు ధైర్యం చెబుతున్నారు. ‘ఆమెలేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది,  ధైర్యంగా ఉండండి’ అని పోస్ట్‌లు పెడుతున్నారు. 




Updated Date - 2022-10-01T00:58:18+05:30 IST