ఘనంగా Namitha సీమంతం వేడుకలు

ABN , First Publish Date - 2022-06-05T17:58:53+05:30 IST

ఒకప్పడు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది నమిత (Namitha). అభిమానులు ఆమెకు ఒక గుడిని కూడా కట్టేశారు. తెలుగులో కూడా ఆమె పలు చిత్రాల్లో కథానాయికగా నటించినప్పటికీ ఏమంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు మలయాళ, కన్నడ, ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. తన శరీరం బరువు పెరిగిపోవడంతో ఆమెకు ఒక దశలో అవకాశాలే కరువయ్యాయి.

ఘనంగా Namitha సీమంతం వేడుకలు

ఒకప్పడు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది నమిత (Namitha). అభిమానులు ఆమెకు ఒక గుడిని కూడా కట్టేశారు. తెలుగులో కూడా ఆమె పలు చిత్రాల్లో కథానాయికగా నటించినప్పటికీ ఏమంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి.  తెలుగు, తమిళ చిత్రాలతో పాటు మలయాళ, కన్నడ, ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. తన శరీరం బరువు పెరిగిపోవడంతో ఆమెకు ఒక దశలో అవకాశాలే కరువయ్యాయి. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ప్రత్యేకపాత్రల్లో కనిపించి, ఐటెమ్ సాంగ్స్ లోనూ నర్తిస్తూ తన కెరీర్ ను కొంత కాలం లాగించింది. ఐదేళ్ళ క్రితం బిజినెస్ మేన్ వీరేంద్ర చౌదరి (Veerendra Chowdary) ని ప్రేమించి పెళ్ళాడింది నమిత. 


ప్రస్తుతం నమిత (Namitha) తన జీవితంలోని ఆనంద క్షణాల్ని గడుపుతోంది. నమిత, వీరేంద్ర దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. నిజానికి నమిత తల్లికాబోతున్న విషయాన్ని అధికారికంగా చాలా రోజుల పాటు ప్రకటించలేదు. తన 41వ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో బేబీ బంప్ ఫోటో షేర్ చేసి మరీ వెల్లడి చేసింది. ఇటీవల నమిత తన కుటుంబ సభ్యుల సమక్షంలో సీమంతం వేడుకల్ని ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే.. బేబీ బంప్ తో కూడిన ఫోటో షూట్ లో పాల్గొని ఆ ఫోటోస్ ను కూడా నమిత ఇటీవల తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేయగా.. అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. మరికొన్ని రోజుల్లో నమిత ఇంట్లోకి మూడో వ్యక్తి రాబోతున్నారు. ఈ సందర్భంగా ఈ దంపతులిద్దరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 



Updated Date - 2022-06-05T17:58:53+05:30 IST