Namitha కవలలకు జన్మనిచ్చిన నమిత..

ABN , First Publish Date - 2022-08-20T17:00:59+05:30 IST

సీని నటి నమిత (Namitha) కవల పిల్లలకు జన్మినిచ్చారు (Namitha Blessed With Twin Baby Boys). ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేస్తూ తన భర్త, పిల్లలతో ఉన్న ఓ వీడియోను విడుదల చేశారు.

Namitha కవలలకు జన్మనిచ్చిన నమిత..

సినీ నటి నమిత (Namitha) కవల పిల్లలకు జన్మినిచ్చారు (Namitha Blessed With Twin Baby Boys). ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేస్తూ తన భర్త, పిల్లలతో ఉన్న ఓ వీడియోను విడుదల చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తమ అభిమానులకు శుభవార్త చెబుతున్నామని నటి నమిత.. కవల పిల్లలతో ఉన్న వీడియోలను విడుదల చేశారు. అలాగే, ఇద్దరూ మగపిల్లలేనని.. ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని తన భర్తతో కలిసి ఆ కవలలిద్దరినీ తీసుకొని ఆలయానికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు నమిత. ఇక ఆలయ ప్రాంగణంలో తీసిన వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.


చెన్నై నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇద్దరు మగ శిశువులకు నమిత జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి యాజమాన్యానికి, గర్భం దాల్చిన నాటి నుంచి వైద్య చికిత్స, సలహాలు, సూచనలు అందించిన డాక్టర్లు భువనేశ్వరి, ఈశ్వర్, వెల్లు మురుగన్, డాక్టర్ నరేశ్‌కు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు కూడా అభిమానుల ఆశీస్సులు తమకు ఉండాలని కోరారు.


కాగా, నమిత భర్త నటుడు వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరి. వీరికి నవంబర్ 2017లో తిరుపతిలోని ఇస్కాన్ లోటస్ టెంపుల్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, టీవీ- సినిమా రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. 



Updated Date - 2022-08-20T17:00:59+05:30 IST