ప్రపంచం అంతటా ఆ సాంగ్ వైరల్... చైనాలో మాత్రం బ్యాన్...

ABN , First Publish Date - 2021-11-26T21:26:48+05:30 IST

మలేషియాకు చెందిన ర్యాపర్ నమీవీ, ఆస్ట్రేలియాకు చెందిన గాయిని కింబెర్లీ చెన్ ‘ఫ్రాజైల్’ అనే సాంగ్ రీలీజ్ చేశారు. ఆ పాప్ సాంగ్ క్రమంగా దేశదేశాల్లో వైరల్ అవుతోంది. అయితే, చైనా దేశంలో మాత్రం...

ప్రపంచం అంతటా ఆ సాంగ్ వైరల్... చైనాలో మాత్రం బ్యాన్...

మలేషియాకు చెందిన ర్యాపర్ నమీవీ, ఆస్ట్రేలియాకు చెందిన గాయిని కింబెర్లీ చెన్ ‘ఫ్రాజైల్’ అనే సాంగ్ రీలీజ్ చేశారు. ఆ పాప్ సాంగ్ క్రమంగా దేశదేశాల్లో వైరల్ అవుతోంది. అయితే, చైనా దేశంలో మాత్రం ‘ఫ్రాజైల్’కి ఎదురు గాలి తప్పలేదు. ఇప్పటికే చైనా కమ్యూనిస్టు పాలకులు అన్ని రకాల స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ నుంచీ పాప్ సాంగ్‌ని తప్పించేశారు... 


‘ఫ్రాజైల్’ పాప్ సాంగ్‌పై చైనీస్ గవర్నమెంట్ సీరియస్ కావటానికి కారణం అందులో వాడిన పదాలు, అంశాలే అంటున్నారు. చైనాలో జరుగుతోన్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి పాటలో ప్రస్తావించారట. అలాగే ‘లిట్టిల్ పింక్స్’ అనే పదాలు కూడా లిరిక్స్‌లో ఉపయోగించారట. ఆన్‌లైన్‌లో చైనాని ఎవరు విమర్శించిన వాళ్లపై ప్రతి దాడి చేసేది ఈ ‘లిట్టిల్ పింక్సే’! ఇక వైరల్ పాప్ సాంగ్‌లో ‘పూ’ అనే పదం కూడా వినిపిస్తుందట. దానిపై కూడా చైనాకి అభ్యంతరమే. ఎందుకంటే, ‘పూ’ అనేది ఒక డిస్నీ వారి కార్టూన్ క్యారెక్టర్. అది గతంలో చాలా సార్లు తెర మీద చైనీస్ ప్రెసిడెంట్ జీ జినిపింగ్‌ను టార్గెట్ చేసింది. కావాలని ‘పూ’ చేత చైనా అధ్యక్షుడ్ని ట్రోల్ చేయించే వారు డిస్నీ రైటర్స్. మరి అటువంటి ‘పూ’ కూడా ‘ఫ్రాంఛైజ్’ పాటలో ఉన్నాక బీజింగ్ ఎందుకు ఊరుకుంటుంది చెప్పండి? చైనా ప్రజలు ఎవ్వరూ ఆ వైరల్ పాప్ సాంగ్ ఇక మీదట వినకుండా, చూడకుండా, షేర్ చేయకుండా కంప్లీట్‌గా బ్యాన్ చేసేసింది!

Updated Date - 2021-11-26T21:26:48+05:30 IST