‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’.. నాలో ఆత్మవిశ్వాసం నింపింది: Nagesh Kukunoor

ABN , First Publish Date - 2022-07-07T00:22:03+05:30 IST

అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 8 నుంచి ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ (Modern Love Hyderabad) వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోన్న విషయం తెలిసిందే. మొత్తం ఆరు కథలతోఈ వెబ్ సిరీస్‌ తెరకెక్కగా.. అందులో మూడు కథలకు ‘గుడ్ లక్ సఖి’ చిత్ర దర్శకుడు

‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’.. నాలో ఆత్మవిశ్వాసం నింపింది: Nagesh Kukunoor

అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 8 నుంచి ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ (Modern Love Hyderabad) వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోన్న విషయం తెలిసిందే. మొత్తం ఆరు కథలతోఈ వెబ్ సిరీస్‌ తెరకెక్కగా.. అందులో మూడు కథలకు ‘గుడ్ లక్ సఖి’ చిత్ర దర్శకుడు నాగేష్ కుకునూర్ (Nagesh Kukunoor) దర్శకత్వం వహించారు. తెలుగు వాడైన నాగేష్ కుకునూర్.. బాలీవుడ్ దర్శకుడిగా మంచి పేరు పొందిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో దర్శకుడిగా ఆయన చిత్రాలు చేస్తున్నప్పుడే.. తెలుగులో అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా సినిమాలు చేస్తానని అప్పటిలో ప్రకటించారు. ప్రకటించినట్లుగానే.. ‘గుడ్ లక్ సఖి’ చిత్రంతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నాగేష్.. ఇప్పుడు ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’‌తో వారికి మరింత దగ్గర కాబోతున్నారు. ఈ వెబ్ సిరీస్‌‌లో తన పార్ట్ గురించి, అలాగే తెలుగు సినిమాల గురించి తాజాగా ఆయన మీడియాతో ముచ్చటించారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ నా మాతృభాష తెలుగు అయినప్పటికీ.. చిన్నతనం నుండి ముంబైలో ఎక్కువగా పెరగడం వల్ల బాలీవుడ్‌కి దగ్గరవడం జరిగింది. నాకు నా మాతృభాషలో సినిమా చేయాలని ఎప్పటి నుండో కోరిక ఉండేది. ఆ కోరిక ‘గుడ్ లక్ సఖి’తో తీరింది. ఆ సినిమాతో ఇప్పుడు తెలుగులో అమెజాన్ ప్రైమ్ వారి ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్‌’కి సంబంధించి మూడు కథాంశాలకు దర్శకత్వం వహించే అవకాశం లభించింది. ఇది చాలా కష్టమైన పని అయినప్పటికీ.. సవాలుగా తీసుకుని చిత్రీకరించడం జరిగింది.  సుహాసిని మణిరత్నం-నరేష్ అగస్త్యల ‘వై డీడ్ శే లీవ్ మీ దేర్’... రీతూ వర్మ మరియు ఆది పినిశెట్టిల ‘ఫజీ, పర్పుల్ & ఫుల్ ఆఫ్ థర్న్స్’ మరియు నిత్యా మీనన్, రేవతిల ‘నా అన్‌లైక్ పాండమిక్ డ్రీమ్ పార్టనర్’ అనే మూడు కథలను నేను చెప్పడం జరిగింది. ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’తో వివిధ రకాల కథలను అన్వేషించడానికి నాకు ఆస్కారం లభించింది. ఈ కథలతో నాలో కూడా సృజనాత్మకత పెరిగింది. ఈ మూడు కథలను తెరకెక్కించడానికి SIC ప్రొడక్షన్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి కూడా పూర్తి స్వేచ్ఛ లభించింది. విభిన్న నటీనటులతో పనిచేయడం కూడా నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచింది. నా మాతృభాషలో ఇంకా మరెన్నో చిత్రాలు, వెబ్ సిరీస్‌లు చేయగలననే నమ్మకం.. ఈ ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ కల్పించింది. జూలై 8న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతోన్న ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’.. అందరినీ మెప్పిస్తుందని ఆశిస్తున్నాను..’’ అని తెలిపారు.





Updated Date - 2022-07-07T00:22:03+05:30 IST