లండన్ లో Phalana Abbai - Phalana Ammai

ABN , First Publish Date - 2022-07-03T16:53:26+05:30 IST

యంగ్ హీరో నాగశౌర్య (Nagasourya), మల్లూ బ్యూటీ మాళవికా నాయర్ (Malavika Nair) జంటగా.. శ్రీనివాస అవసరాల (Srinivas Avasarala) తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ (Phalana Abbai - Phalana Ammai).

లండన్ లో Phalana Abbai - Phalana Ammai

యంగ్ హీరో నాగశౌర్య (Nagasourya), మల్లూ బ్యూటీ మాళవికా నాయర్ (Malavika Nair) జంటగా.. శ్రీనివాస అవసరాల (Srinivas Avasarala) తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ (Phalana Abbai - Phalana Ammai). పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా లండన్‌లో పలు సుందరమైన ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. నాయికా నాయకులతో పాటు ప్రధాన తారాగణం పాల్గొన్న సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.  


ఇంతకు ముందు నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ‘కళ్యాణ వైభోగమే’ (Kalayana Vaibhogame) సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే.. నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్ లో ఇది వరకు వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ (Oohalu Gusagusalade), జ్యో అచ్యుతానంద (jyo Achuthananda)’ చిత్రాలు విశేషమైన ప్రజాదరణ పొందాయి. ఈ నేపథ్యంలో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  


నాగశౌర్య గత చిత్రాలు ‘వరుడు కావలెను (Varudu Kavalenu), లక్ష్య’  (Lakshya) చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితం రాబట్టలేకపోయాయి. అందుకే అతడి ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. దర్శకుడిగా శ్రీనివాస అవసరాల మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రేమకథాచిత్రాలు తీయడంలో ఈ దర్శకుడికి మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కాబోతోంది. నాగశౌర్య మరో సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’ (Krishna Vrinda Vihari) చిత్రం నిజానికి మేనెల్లోనే విడుదల కావాలి. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా తర్వాత  ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా అతడికి ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.   

Updated Date - 2022-07-03T16:53:26+05:30 IST