The Ghost trailer : ఒక్కడ్ని కూడా వదలను...

ABN , First Publish Date - 2022-08-25T23:10:59+05:30 IST

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ (The Ghost). ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్‌లో సోనాల్ చౌహాన్ (Sonal Chousan) కథానాయికగా నటిస్తోంది.

The Ghost trailer : ఒక్కడ్ని కూడా వదలను...

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ (The Ghost). ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్‌లో సోనాల్ చౌహాన్ (Sonal Chousan) కథానాయికగా నటిస్తోంది. మలయాళ బ్యూటీ అనిఖా సురేంద్రన్, గుల్ పనాగ్, మనీష్ చౌదరి, జయప్రకాశ్, శ్రీకాంత్ అయ్యంగార్, రవివర్మ, బిలాల్ హుస్సేన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వరా సినిమాస్ ఎలెల్పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త నిర్మాణంలో సినిమా తెరకెక్కుతోంది. అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ ను వదిలారు మేకర్స్. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


పెద్ద ఖడ్గంతో ప్రత్యర్ధుల్ని ఊచకోత కోసే సీన్ తో ట్రైలర్ మొదలైంది. ‘ఊటీనుంచి ఫోనొచ్చింది’ అనే నాగ్ వాయిస్ తో ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది రివీల్ చేశారు. అనూ.. ఆఫ్టర్ 20 ఇయర్స్.. ‘తమ్ముడిగా నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటావని నాకు మాటివ్వు’. ‘నువ్వు, నీ కూతురు బతికుండాలంటే అన్నీ వదిలేసి పారిపోండి’. ‘ఎవర్ని నమ్మాలో తెలియడం లేదు విక్రమ్’. ‘అదితీని, నిన్ను చూసుకొనే రెస్పాన్సిబిలిటీ నాది. కిడ్నాపర్స్, మర్డరర్స్, యంగ్ స్టర్స్ అండర్ వరల్డ్ మొత్తం ఒకటే అంది. స్కార్పియన్ ఎక్కడ? వీడు జస్ట్ ఏ బాడీ గార్డ్ .. ఎలా ఆపుతావ్ విక్రమ్? చావును చాలా సార్లు చాలా దగ్గరగా చూసాను ప్రియ’. అంటూ వివిధ పాత్రలు పలికే డైలాగ్స్‌తో స్టిన్నింగ్ విజువల్స్ తో ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ఇట్ నెవర్ స్టాప్స్. ఒక్కడ్ని కూడా వదలను... అని నాగ్ అగ్రెసివ్ గా పలికే డైలాగ్ తో ట్రైలర్ ఎండ్ అవుతుంది.  


డ్రగ్స్ అండ్ హ్యూమన్ ట్రాఫింగ్ పై ‘ది ఘోస్ట్’ కథాంశం ఉంటుందని అర్ధమవుతోంది. కిల్లింగ్ మెషీన్ (Killingmachine) గా పేరుపడిన సీక్రెట్ ఏజెంట్ విక్రమ్.. కుటుంబాన్ని మట్టుబెట్టాలని మాఫియా చూస్తుంటుంది. ఆ ప్రయత్నంలో నాగ్ తన అన్నను పోగొట్టుకుంటాడు. చెల్లె్ల్ని, ఆమె కూతుర్ని వారి బారినుంచి కాపాడాలనే లక్ష్యంతో శత్రుసంహారం మొదలు పెడతాడు. ఇంతకీ వారిని ఘోస్ట్ ఎలా కాపాడాడు అన్నదే మిగతా కథ. నాగార్జున పాత్ర ఇందులో సరికొత్తగా కనిపిస్తోంది.  యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అభిమానుల్ని అలరించే స్థాయిలో ఉన్నాయి. ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. మరి ఈ సినిమా నాగ్ కు ఏ స్థాయిలో సక్సెసె అందిస్తుందో చూడాలి. 



Updated Date - 2022-08-25T23:10:59+05:30 IST