Nagarjuna: ఈ ఎన్టీఆర్ సమక్షంలో.. ఆ ఎన్టీఆర్ బిడ్డని తలుచుకుంటా!

ABN , First Publish Date - 2022-09-04T00:39:14+05:30 IST

‘ఈ ఎన్టీఆర్ సమక్షంలో.. ఆ ఎన్టీఆర్ బిడ్డ, నా అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు..’ అని బ్రహ్మాస్త్ర మీడియా సమావేశంలో నందమూరి హరికృష్ణను గుర్తు చేసుకున్నారు కింగ్ నాగార్జున

Nagarjuna: ఈ ఎన్టీఆర్ సమక్షంలో.. ఆ ఎన్టీఆర్ బిడ్డని తలుచుకుంటా!

‘ఈ ఎన్టీఆర్ సమక్షంలో.. ఆ ఎన్టీఆర్ బిడ్డ, నా అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు..’ అని బ్రహ్మాస్త్ర మీడియా సమావేశంలో నందమూరి హరికృష్ణను గుర్తు చేసుకున్నారు కింగ్ నాగార్జున (King Nagarjuna). బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ క‌పూర్ హీరోగా అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శక‌త్వంలో భారీ బ‌డ్జెట్, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా ‘బ్రహ్మాస్త్రం మొద‌టి భాగం: శివ‌’ (Brahmastram). ఆలియా భట్ హీరోయిన్‌. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్, నాగార్జున కీలక పాత్రలలో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మల‌యాళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 9న గ్రాండ్ లెవ‌ల్లో సినిమా విడుదల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైద‌రాబాద్ పార్క్ హ‌యాత్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ‘‘రాజమౌళిగారు ఈ వేడుకను ఆర్గనైజ్ చేస్తున్నారు.. ఎలా ఉంటుందోన‌నిపించింది. అలాగే తార‌క్ ఈవెంట్‌కి వ‌స్తున్నాడంటే క్రేజ్‌, ఫ్యాన్స్ ఎలా ఉంటుందోన‌ని మ‌న‌సులో ఊహించుకున్నాను. సెప్టెంబ‌ర్ 2.. నా అన్న హ‌రికృష్ణ (Harikrishna)గారి బ‌ర్త్‌డే. నందమూరి తార‌క రామారావు (NTR)గారి బిడ్డ.. ఆయ‌న బిడ్డ నంద‌మూరి తార‌క రామారావు ఇక్కడ కూర్చున్నాడు. ఆయన బిడ్డ ముందు నా అన్నకు ఓసారి తలుచుకుంటూ.. హ్యాపీ బ‌ర్త్‌డే చెప్పుకుంటున్నాను. అన్న హ్యాపీ బర్త్‌డే. రాజ‌మౌళిగారు ఈ సినిమాను స‌మ‌ర్పిస్తున్నారంటే ఏదో ఊర‌క‌నే కాదు.. అయాన్ ఆల్ రెడీ స్క్రిప్ట్ చెప్పారు. నాలుగేళ్ల ముందు నుంచి రాజ‌మౌళిగారు ఈ జ‌ర్నీలో భాగ‌మై ఉన్నారు. సాధార‌ణంగా రాజ‌మౌళిగారే ఆయ‌న సినిమాను మూడు నాలుగేళ్ల పాటు తెర‌కెక్కిస్తారు. సినిమాను చెక్కుతుంటారు కాబ‌ట్టే ఆయనకు జ‌క్కన్న అనే పేరు వ‌చ్చింది. ఇప్పుడు త‌న ప్రతి రూపంగా అయాన్ క‌నిపిస్తున్నారు. నేను చూసినంత వ‌ర‌కు బ్రహ్మాస్త్ర విజువ‌ల్‌గా అంద‌రినీ ఆశ్చర్యపరుస్తుంది. అంద‌రికీ వండ‌ర్‌ఫుల్ జ‌ర్నీగా.. విజువ‌ల్ ట్రీట్‌గా అనిపిస్తుంది. మౌనీ రాయ్ అద్భుతంగా న‌టించింది. ర‌ణ్‌బీర్ క‌పూర్ - ఆలియా భ‌ట్‌ల‌ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పుడు నా స్నేహితుల‌య్యారు. మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు. అందుకే వారిద్దరూ ఒక్కట‌య్యారు. టాలెంట్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి.. ఎలా ఎంక‌రేజ్ చేయాలో క‌ర‌ణ్ జోహార్‌కు చాలా బాగా తెలుసు. ఇప్పటి వ‌ర‌కు రిలీజ్ కాన‌టువంటి భారీ చిత్రంగా ఈ ‘బ్రహ్మాస్త్ర’ ఉండ‌బోతుంది..’’ అన్నారు. (King Nagarjuna Speech)





Updated Date - 2022-09-04T00:39:14+05:30 IST