సమంతే విడాకులు కోరింది: నాగార్జున

ABN , First Publish Date - 2022-01-27T20:02:21+05:30 IST

సమంత, నాగచైతన్య విడాకులు తీసుకొని నాలుగు నెలలు కావొస్తుంది. విడాకులకు కారణం ఏంటనేది ఇప్పటికీ బయటకు రాలేదు. ఈ విషయంపై స్పందించిన నాగార్జున తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘చై–సామ్‌ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. నాకు తెలిసింత వరకూ విడిపోయే అంతగా సమస్య రాలేదు.

సమంతే విడాకులు కోరింది: నాగార్జున

సమంత, నాగచైతన్య విడాకులు తీసుకొని నాలుగు నెలలు కావొస్తుంది. విడాకులకు కారణం ఏంటనేది ఇప్పటికీ బయటకు రాలేదు. ఈ విషయంపై స్పందించిన నాగార్జున తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘చై–సామ్‌ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. నాకు తెలిసింత వరకూ విడిపోయే అంతగా సమస్య రాలేదు. గత ఏడాది ఇద్దరూ కొత్త సంవత్సర వేడుకలు సంతోషంగా నిర్వహించుకున్నారు. ఆ తర్వాతే వాళ్లిద్దరి మధ్య ఏదో సమస్య వచ్చింది. కచ్చితంగా ఏమిటనేది నాకూ తెలీదు. కానీ, సమంతేమొదట విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుని అప్లయ్‌ చేసింది. ఆమె నిర్ణయాన్ని గౌరవించి నాగచైతన్య అంగీకారం తెలిపాడు. నా గురించే చైతన్య ఎక్కువగా బాధపడ్డాడు. విడాకుల విషయాన్ని నేను ఎలా తీసుకుంటాను, కుటుంబ పరువు, మర్యాద ఏమైపోతుంది? అనే తను ఎక్కువగా ఆలోచించాడు’’ అని నాగార్జున అన్నారు. 


Updated Date - 2022-01-27T20:02:21+05:30 IST