Nagarjuna: చైతూ విడాకులపై తొలిసారి ఇలా..!

ABN , First Publish Date - 2022-09-16T03:22:24+05:30 IST

నాగచైతన్య- సమంత (Naga Chaitanya - Samantha)ల విడాకుల తర్వాత అనేక రకాలుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అసలెందుకు వారిద్దరూ విడిపోయారనే విషయంపై..

Nagarjuna: చైతూ విడాకులపై తొలిసారి ఇలా..!

నాగచైతన్య- సమంత (Naga Chaitanya - Samantha)ల విడాకుల తర్వాత అనేక రకాలుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అసలెందుకు వారిద్దరూ విడిపోయారనే విషయంపై ఇంత వరకు సరైన క్లారిటీ రాలేదు కానీ.. వారిద్దరి మధ్య చాలా కాలంగా గొడవలైతే జరుగుతున్నాయనేది.. ఇటీవల సమంత బాలీవుడ్‌లోని ఓ షో లో మాట్లాడిన తీరు తెలియజేసింది. ‘మా మధ్య సఖ్యత లేదు.. ఒకవేళ ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే అక్కడ పదునైన ఆయుధాలు లేకుండా చూడాలి’.. ‘భర్త కాదు.. మాజీ భర్త అనండి’ అంటూ సమంత (Samantha) ఈ షో లో చైతూ ప్రస్తావనకు బదులిచ్చింది. సమంత చేసిన ఈ కామెంట్స్ తర్వాత ఒక్కసారిగా మళ్లీ వాతావరణం వేడెక్కింది. అక్కినేని అభిమానులు (Akkineni Fans) సమంతను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. సమంత కూడా స్ట్రాంగ్‌గా బదులిస్తూనే వస్తుంది. అయితే కొన్ని రోజులుగా చైతూ-సమంతలపై వార్తలు తగ్గాయి... వారిని టార్గెట్ చేసేవారు కూడా కాస్త వెనక్కి తగ్గారు. అయితే, కింగ్ నాగార్జున (King Nagarjuna) తాజాగా చైతూ-సమంతల వ్యవహారంపై మాట్లాడటంతో.. మరోసారి వారి టాపిక్ సోషల్ మాధ్యమాలలో హైలెట్ అవుతోంది. చైతూ-సమంతల విడాకుల తర్వాత ఫస్ట్ టైమ్ నాగార్జున.. నాగచైతన్య లైఫ్ గురించి బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. 



చైతూ-సమంతల విడాకులపై వచ్చే వార్తలను చూసి.. చైతూ జీవితం ఇలా అయిపోయిందేంటని మీరేమైనా బాధపడుతుంటారా? అని బాలీవుడ్ మీడియా అడిగిన ప్రశ్నకు.. ‘‘చైతూ (Chaitu) ఇప్పుడు సంతోషంగానే ఉన్నాడు. అది చాలు నాకు. ఈ విషయం నాకు చాలా ఆనందాన్నిస్తోంది. పెళ్లి బ్రేక్‌ అవ్వడమనేది చైతూ విషయంలో దురదృష్టకరమైన విషయమే. కానీ అది తనకొక అనుభవంలా ఉండిపోతుంది. జరగాల్సింది జరిగిపోయింది కాబట్టి.. దానిని మనం ఇప్పుడేం చేయలేము. ఈ విషయం మీద ఇంకా మనం ఆలోచించుకోవడం కూడా సరికాదు. ప్రజలు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం మానేస్తారని భావిస్తున్నాను..’’ అని నాగార్జున సమాధానమిచ్చారు. దీంతో, మరోసారి చైతూ-సమంతల పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక నాగార్జున కూడా.. వారి విషయం వదిలేయండి అని చెప్పాడు కాబట్టి.. ఇకనైనా చైతూ-సమంతల వార్తలు ఆగుతాయోమో చూద్దాం.  

Updated Date - 2022-09-16T03:22:24+05:30 IST