నాకు ప్రేమించడం నేర్పింది తనే : Nagachaitanya

ABN , First Publish Date - 2022-07-07T18:36:12+05:30 IST

అక్కినేని నవసామ్రాట్ నాగచైతన్య (Nagachaitayna) తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ (Thnakyou). విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రాశీఖన్నా (Rashi Khanna), అవికాగోర్ (Avikagor) కథానాయికలుగా నటిస్తున్నారు.

నాకు ప్రేమించడం నేర్పింది తనే  : Nagachaitanya

అక్కినేని నవసామ్రాట్ నాగచైతన్య (Nagachaitayna) తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ (Thnakyou). విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రాశీఖన్నా (Rashi Khanna), అవికాగోర్ (Avikagor) కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లోకి రాబోతోంది. ఈ సందర్బంగా చైతూ.. చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా తన జీవితంలో కీలక పాత్ర పోషించిన వారికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.


‘థ్యాంక్యూ.. అవసరమైన సందర్భాల్లో నేను ఎక్కువగా వాడే పదం ఇది. నా తదుపరి చిత్రం థ్యాంక్యూ విడుదలవుతున్న సందర్భంగా నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. నన్ను అమితంగా ప్రేమించి, నా జీవితంలో కీలక పాత్ర పోషించిన వారికే ఈ పోస్ట్ అంకితం చేస్తున్నాను. వారి ప్రేమకు కృతజ్ఞతలు చెబితే సరిపోదు. అమ్మ... నా వెంటే ఉంటూ ఎప్పటికప్పుడు నా బాగోగులు చూస్తూ.. అన్ని విధాలుగా నన్ను ప్రేమిస్తున్నందుకు థ్యాంక్యూ. నాన్న.. ప్రతీ విషయంలో నాకంటూ ఓ దారి చూపించి ఓ స్నేహితుడిలా ఉన్నందుకు థ్యాంక్యూ.. అలాగే. హ్యాష్ (Hash) (పెంపుడు కుక్క) ప్రేమించడం ఎలాగో తెలిసేలా చేసి.. నన్నొక మనిషిలా ఉంచినందుకు ‘థ్యాంక్యూ’.. అంటూ తన తల్లి, తండ్రి, హ్యాష్ ఫోటోస్ షేర్ చేశాడు. నాగచైతన్య చేసిన ఈ ట్వీట్ .. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  







Updated Date - 2022-07-07T18:36:12+05:30 IST