Nagababu: అప్పుడు నాకు ఆ జ్ఞానం లేదు నాన్న!

ABN , First Publish Date - 2022-06-26T19:38:13+05:30 IST

‘‘ఇష్టమైన వారు మనతో ఉన్నప్పుడే వాళ్లపై మనకెంత ప్రేమ ఉందో తెలియజేయాలని కోరారు’’ చిరంజీవి సోదరుడు నాగబాబు. శనివారం తన తండ్రి వెంకటరావు జయంతి సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా భావోద్వేగంగా ఓ పోస్ట్‌ చేశారు. ‘‘నాన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు.

Nagababu: అప్పుడు నాకు ఆ జ్ఞానం లేదు నాన్న!

‘‘ఇష్టమైన వారు మనతో ఉన్నప్పుడే వాళ్లపై మనకెంత ప్రేమ ఉందో తెలియజేయాలని కోరారు’’ చిరంజీవి సోదరుడు నాగబాబు(Nagababu). శనివారం తన తండ్రి వెంకటరావు జయంతి సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా భావోద్వేగంగా ఓ పోస్ట్‌ చేశారు. ‘‘నాన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు బతికి ఉన్నప్పుడు చెప్పాలన్న సెన్స్‌, జ్ఞానం నాకు లేవు. అవి వచ్చాయనుకున్నప్పుడు నువ్వు లేవు. ఈ సందర్భంగా అందరికీ నేను చెప్పేది ఒకటే ‘మీకు ప్రియమైన వారు ప్రాణాలతో ఉన్నప్పుడే వాళ్లంటే మీకు ఎంత ఇష్టమో వారికి తెలియపర్చండి’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన టీవీ షోలతోపాటు సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. మరోవైపు రాజకీయంగా జనసేనలో కీలక నేతగా ముందుకెళ్తున్నారు. (Nagababu emotional post)




Updated Date - 2022-06-26T19:38:13+05:30 IST