Nagababu: ముల్లును ముల్లుతోనే తీయాలి అంటే ఇదేనేమో!

ABN , First Publish Date - 2022-09-23T16:29:26+05:30 IST

మెగాబ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu) సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi)ని ఎవరైనా..

Nagababu: ముల్లును ముల్లుతోనే తీయాలి అంటే ఇదేనేమో!

మెగాబ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu) సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi)ని ఎవరైనా విమర్శించినా, లేదా మెగా ఫ్యామిలీ (Mega Family)కి సంబంధించి ఎవరైనా, ఏమైనా కామెంట్స్ చేసినా వెంటనే ఆయన రియాక్ట్ అవడమే కాకుండా.. కౌంటర్స్ సంధిస్తూ ఉంటారు. ఇంకా తన కుమార్తె నిహారిక (Niharika)తో సరదాగా చేసే కొన్ని ఫన్నీ వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన తన ఇన్‌స్టా వేదికగా ఇప్పుడు అలాంటి వీడియోనే షేర్ చేశారు. ప్రజంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏముందంటే..


నాగబాబు చేతికి గాయమైతే.. ట్రీట్‌మెంట్ అనంతరం డాక్టర్స్ బ్యాండేజ్ వేసి కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లుగా ఈ వీడియో చూస్తుంటే తెలుస్తుంది. ఈ రెస్ట్ టైమ్‌లో తన కుమార్తె (Nagababu Daughter) చేసిన పనికి.. ఆయన ‘ముల్లును ముల్లుతోనే తీయాలి అంటే ఇదేనేమో’ అనేలా ఫీలయ్యారు. నెటిజన్లు కూడా ఫీలవ్వడం కోసం దానిని.. సోషల్ మీడియా వేదికగా ఆ సన్నివేశాన్ని షేర్ చేశారు.


వీడియోలో ఉన్న విషయంలోకి వస్తే.. గాయమైన చేతిని పట్టుకుని చాలా నొప్పిగా ఉందంటూ నాగబాబు (Nagababu) అంటుంటే.. ఆ నొప్పిని నేను పోగొట్టనా అంటూ.. నాగబాబు మరో చేతిని నిహారిక కొరికేసింది. నిహారిక చేసిన ఈ పనికి నాగబాబు కెవ్వున అరిచేశాడు. చూశావా.. ఆ చేయి నొప్పి పోయింది అంటూ నిహారిక అంటే.., ఇప్పుడు ఈ చేయి నొప్పిగా ఉంది కదమ్మా.. అంటూ నాగబాబు సమాధానమిచ్చారు. నాగబాబు రియాక్షన్‌తో నిహారిక నవ్వుకుంది. మెగా బ్రదర్ షేర్ చేసిన ఈ వీడియో తండ్రికూతుళ్ల మధ్య ఎటువంటి బాండిండ్ ఉందో, ఉండాలో మరోసారి స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ వీడియోని షేర్ చేసిన నాగబాబు.. ‘‘ముల్లును ముల్లుతోనే తీయాలి అంటే ఇదేనేమో.. దయచేసి దీనిని ఇంటి వద్ద ట్రై చేయకండి. ఇది నిపుణురాలైన డాక్టర్ నిహారిక (Dr Niharika) పర్యవేక్షణలో జరిగింది’’ అంటూ ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీనికి నెటిజన్లు.. ‘మీ చేతికి ఏమైంది సార్.. మీరు త్వరగా కోలుకోవాలి’ అని కొందరు, ‘మా అక్క కోతి’ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దాన్ని ముల్లుని ముల్లుతో తీయడం అని కాదు, గీతని చెరపకుండా చిన్నది చేయడానికి పక్కన పెద్ద గీత గీయడం అంటారని ఇంకొందరు సామెతని సరిచేస్తున్నారు.



Updated Date - 2022-09-23T16:29:26+05:30 IST