Nagababu: అన్నయ్య ఆకాంక్ష తప్పకుండా నెరవేరుతుంది

ABN , First Publish Date - 2022-10-05T21:08:31+05:30 IST

‘‘మేమిద్దరం చెరో వైపు ఉండటం కంటే.. నేను తప్పుకోవడమే నా తమ్ముడు మరింతగా ఉద్భవించడానికి ఉపయోగకరం అవుతుందేమోననే రాజకీయాల నుండి తప్పుకున్నాను..’’ అని..

Nagababu: అన్నయ్య ఆకాంక్ష తప్పకుండా నెరవేరుతుంది

‘‘మేమిద్దరం చెరో వైపు ఉండటం కంటే.. నేను తప్పుకోవడమే నా తమ్ముడు మరింతగా ఉద్భవించడానికి ఉపయోగకరం అవుతుందేమోననే రాజకీయాల నుండి తప్పుకున్నాను..’’ అని చిరంజీవి (Chiranjeevi) ఉన్నతత్వంతో చెప్పిన మాట కోట్లాది మంది తమ్ముళ్ళ మనసులు గెలుచుకుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు (Konidela Nagababu) అన్నారు. దీనిపై జనసేన పార్టీ తరపున ఓ లేఖను ఆయన విడుదల చేశారు. తన సోదరులైన చిరంజీవి, పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)ల విషయంలో ఎవరైనా ఏదైనా అంటే.. సోషల్ మీడియా వేదికగా నాగబాబు ఏ విధంగా స్పందిస్తుంటారో తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే నాగబాబు.. జనసేన పార్టీని, మెగా ఫ్యామిలీని విమర్శించిన వారిపై.. తనదైన తరహాలో స్పందిస్తూ కౌంటర్స్ సంధిస్తూ ఉంటారు. అలాగే మెగాభిమానులను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తూ ఉంటారు. జనసేన పార్టీలో ఓ కీలక పోస్ట్‌లో ఉన్న నాగబాబు.. ‘గాడ్‌ఫాదర్’ ప్రమోషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందిస్తూ.. జన సైనికులను, వీర మహిళలను అలెర్ట్ చేశారు. అన్నయ్య చిరంజీవి ఆశీస్సులతో తమ్ముడు పవన్ కల్యాణ్ తప్పకుండా పాలనా పగ్గాలు చేపడతారని, జన సైనికులుగా మేమంతా ఆ మహత్ కార్యాన్ని నెరవేర్చి చూపిస్తామని.. మీడియాకి విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో నాగబాబు పేర్కొన్నారు. 


ఇంకా ఈ లేఖలో..

‘‘జనసేనాని పవన్ కల్యాణ్ వంటి నిబద్ధత ఉన్న నాయకుడు పరిపాలనా పగ్గాలు చేపట్టాలనే అన్నయ్య ఆకాంక్ష తప్పకుండా నెరవేరుతుంది. జన సైనికులుగా మేమంతా ఆ మహత్ కార్యాన్ని నెరవేర్చి చూపిస్తాం. నా తమ్ముడు రాష్ట్రాన్ని ఏలే నాయకుడు కావొచ్చు. పవన్ కల్యాణ్ నిజాయితీ, నిబద్ధత నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అన్నయ్య చెప్పిన మాటలు జన సైనికులకు, వీర మహిళలకు మనో ధైర్యాన్ని పెంపొందించాయి. భవిష్యత్‌లో చిరంజీవి ఏ పక్షాన ఉంటారనేది ప్రజలు నిర్ణయిస్తారని.. ఆయన చెప్పిన మాటలకు అనుగుణంగా జన సైనికులు, వీర మహిళలు మరింత శ్రమించి ప్రజల మన్ననలు పొందాలని కోరుతున్నాను..’’ అని నాగబాబు చెప్పుకొచ్చారు.



Updated Date - 2022-10-05T21:08:31+05:30 IST