Nagababu: చిరు బర్త్‌డే కార్నివాల్‌.. ప్రత్యేకత ఏంటంటే!

ABN , First Publish Date - 2022-08-18T21:50:06+05:30 IST

‘‘మా కుటుంబం మొత్తానికి అన్నయ్య తండ్రిలాంటి వ్యక్తి. ఆయన పుట్టినరోజంటే మా అందరికీ వేడుకలాంటిది. మా అందరి పుట్టినరోజు వేడుకలు సాధారణంగా జరిగినా అన్నయ్యది మాత్రం ఎప్పుడూ గ్రాండ్‌గా జరుగుతుంది. అభిమానుల ఆనందం కోసం ఈ సారి బర్త్‌డే కార్నివాల్‌గా నిర్వహిస్తున్నాం. ఈ వేదికపై చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి’’ అని నాగబాబు అన్నారు.

Nagababu: చిరు బర్త్‌డే కార్నివాల్‌.. ప్రత్యేకత ఏంటంటే!

‘‘మా కుటుంబం మొత్తానికి అన్నయ్య తండ్రిలాంటి వ్యక్తి. ఆయన పుట్టినరోజంటే మా అందరికీ వేడుకలాంటిది. మా అందరి పుట్టినరోజు వేడుకలు సాధారణంగా జరిగినా అన్నయ్యది మాత్రం ఎప్పుడూ గ్రాండ్‌గా జరుగుతుంది. అభిమానుల ఆనందం కోసం ఈ సారి బర్త్‌డే కార్నివాల్‌గా నిర్వహిస్తున్నాం. ఈ వేదికపై చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి’’ అని  నాగబాబు (nagababu) అన్నారు. ఆగస్ట్‌ 22న గ్రాండ్‌గా జరగబోయే చిరంజీవి పుట్టినరోజు (Chiranjeevi birthday carnival) ‘కార్నివాల్‌’ పోస్టర్‌ను నాగబాబు విడుదల చేశారు. ఈ మేరకు గురువారం బ్లడ్‌బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వేడుకు పవన్‌ హాజరు కావడం లేదని నాగబాబు తెలిపారు. ‘‘ఏపీలో పొలిటికల్‌ ఎఫైర్స్‌ మీటింగ్‌ ఉండటంతో పవన్‌కల్యాణ్‌ (pawan kalyan)దానికి హాజరు కావాల్సి ఉంది. అదే కార్యక్రమానికి నేను కూడా వెళ్లాలి. కానీ నేను ఈ వేడుకకు హాజరవుతా’’ అని నాగబాబు చెప్పారు. 


‘‘అన్నయ్యను అభిమానించే వాళ్లందరికీ ఆయన పుట్టిన రోజంటే పండుగలాంటి. ఆ వేడుకను ప్రతి ఏటా శిల్పకళావేదికలో చేసేవాళ్లం. బర్త్‌డే వేడుకల్లో అభిమానులు ప్రత్యక్షంగా పాల్గొని ఎంజాయ్‌ చేసే విధంగా ఈ ఏడాది కొత్తగా ప్లాన్‌ చేశాం. అభిమానుల కోసం కార్నివాల్‌ ఫెస్టివల్‌ని హైటెక్స్‌లో ఏర్పాటు చేస్తున్నాం. ఇండియాలో ఏ హీరోకి కార్నివాల్‌ లాంటిది పెట్టలేదు. అది అన్నయ్యకే దక్కింది. ఈ కార్నివాల్‌ ఫెస్టివల్‌ అనేది మెగా ఫ్యాన్స్‌కి ఒక జ్ఞాపకంగా ఉండాలి. చాలా ఊళ్లల్లో చిరంజీవి పుట్టినరోజును వేడుకలా చేసుకుంటారు. ఈ ఏడాది మరింత గ్రాండ్‌గా జరగనున్న కార్నివాల్‌లో అన్ని ప్రాంతాల అభిమానులు పాల్గొవాలి. కుదిరిన మేరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కార్నివాల్‌లో ఏర్పాటు చేస్తున్నాం. ఇతర హీరోలు, చిరంజీవిగారిని అభిమానించే వారు అందరూ ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటారు. ఈ వేదికపై నేను మాడ్లాడేది నాలుగైదు నిమిషాలే అయినా అన్నయ్య గురించి ఎవరికీ తెలియని విషయాలు చెబుతాను. శుక్రవారం నుంచి ఎంట్రీ పాసులు బ్లడ్‌బ్యాంక్‌, జిల్లాల వారిగా అధ్యక్షుల దగ్గర అందుబాటులో ఉంటాయి’’ అని అన్నారు. 

Updated Date - 2022-08-18T21:50:06+05:30 IST