ఖైదీ సీఎంగా ఉన్న దేశంలో పోలీస్‌ కేసులు ఒక లెక్కా: నాగబాబు

ABN , First Publish Date - 2022-03-23T00:13:45+05:30 IST

కొంత విరామం తర్వాత చిరంజీవి సోదరుడు నాగబాబు సోషల్‌మీడియలో యాక్టివ్‌ అయ్యారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ తనదైన శైలిలో పంచులు విసురుతున్నారు. తాజాగా ‘టైమ్‌ గ్యాప్‌ వచ్చుండవచ్చు. కానీ టైమింగ్‌లో అసలు గ్యాప్‌ ఉండదు.. ఇక మొదలెడదామా’ అంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో ముచ్చటించారాయన. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంచులు వేశారు. ఆ విషయాలు మీకోసం...

ఖైదీ సీఎంగా ఉన్న దేశంలో పోలీస్‌ కేసులు ఒక లెక్కా: నాగబాబు

కొంత విరామం తర్వాత చిరంజీవి సోదరుడు నాగబాబు సోషల్‌మీడియలో యాక్టివ్‌ అయ్యారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ తనదైన శైలిలో పంచులు విసురుతున్నారు. తాజాగా ‘టైమ్‌ గ్యాప్‌ వచ్చుండవచ్చు. కానీ టైమింగ్‌లో అసలు గ్యాప్‌ ఉండదు.. ఇక మొదలెడదామా’ అంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో ముచ్చటించారాయన. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంచులు వేశారు. ఆ విషయాలు మీకోసం...


చాలాకాలం తర్వాత ఇన్‌స్టాలో అందుబాటులోకి వచ్చారు? 

హయర్‌ పర్పస్‌ కోసం. 


సహజ మరణం అంటే ఏంటి సర్‌?

కల్తీ సారా తాగి చనిపోవడం, కత్తులు, గొడ్డలతో గాయపడి చనిపోవడం, పంటలు పండక పురుగు మందు తాగి చనిపోవడం, గతుకుల రోడ్డు ప్రమాదం జరిగి చనిపోవడం.


‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రాజమౌళి ఏ కత్తి వాడారు? 

కోడి కత్తి కావచ్చు. 


ఆర్‌ఆర్‌ఆర్‌ ఫ్రీగా చూడాలంటే ఎలా సర్‌. 

ఎందుకు చూడలేం! చూడొచ్చు.. చరణ్‌ బదులు నాని, తారక్‌ బదులు శ్రీనివాసు, ఇక డైరెక్టర్‌ ఎవరో మీకు చెప్పక్కర్లేదు. 


పోలీస్‌ కేసులు ఉన్నవారికి రాజకీయాల్లో సీటు వస్తుందా? 

ఖైదీలు సీఎంలుగా ఉన్న దేశంలో పోలీస్‌ కేసులు ఒక లెక్కా? 


పోర్న్‌ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? 

పబ్లిక్‌లో ఇలాంటివి మాట్లాడటం నాకు ఇబ్బందిగా ఉంది. కానీ ఈ మధ్యన నాకొక పొలిటీషియన్‌ గుర్తొస్తున్నాడు. 


మన డబ్బా మనమే కొట్టుకుని పిలిచి నమస్కారం పెట్టించుకునే హయర్‌ పర్పస్‌ మనకు వద్దులెండి? 

అంతేగా అంతేగా..


వరుణ్‌తేజ్‌ పెళ్లెప్పుడు? 

లెట్‌ థెమ్‌ నో..


అసలు మీ పర్పస్ ఏంటో లెట్‌ ధెమ్‌ నో అంకుల్‌? 

నన్ను ఇన్‌వాల్వ్‌ చేయకండి రావుగారు. 


మీరు ఇంత సామ్రాట్‌లా ఉండటానికి కారణం ఏంటి? 

పర్పస్.. పర్పస్ .. పర్పస్ 


కొద్దిరోజుల నుండి మా స్నేహితుడి ఇంట్లో పాత సామాన్లు కనిపించడం లేదు సర్‌. 

మరి వెంటనే వెళ్లి పోలీస్‌లకు ఫిర్యాదు చేయకపోయావా. 


హయర్‌ పర్పస్‌కి వెళ్లడానికి మంచి హెయిర్‌ డ్రసర్‌ ఎక్కడ దొరుకుతారు? 

ఏమో సర్‌ నాకు కనపడదు. 


మన సీఎం పాలన బాగుందంట? 

నువ్వు నిజంగానే నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నావా రాధిక(డీజే టిల్లు మీమ్‌)


ఈసారి ఎంపీ, ఎంఎల్‌ఏ.. దేనికి పోటీ చేస్తున్నారు. 

జనసేన కోసం పనిచేస్తా. 


కాకినాడకు చెందిన రాజకీయ నాయకుడు కల్యాణ్‌ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు? అతనికి ఏమైందంటారు? 

కుక్క కరిచింది. 


జనసేన పార్టీ 2024? 

యెస్‌ 2024


గోవాలో ఏ క్యాసినో బావుంటుంది. 

అక్కడేమో నాకు తెలీదు కానీ.. ఈ మధ్యన ఏపీలో స్టార్ట్‌ అయిందని విన్నా. 


మా చివరి శ్వాస వరకూ జనసేనతోనే ఉంటాం? 

నేను కూడా. 


మంచు మనోజ్‌ స్పీచ్‌ గురించి మీ కామెంట్‌ 

నో కామెంట్స్‌ బ్రో. 


ఒక్క ఛాన్స్‌ గురించి మీ అభిప్రాయం

ఇచ్చినందుకు బాగా దింపారుగా! 


వెల్లుల్లిపాయకు, కొబ్బరికాయకు ఏమన్నా లింక్‌ ఉందంటారా? 

ఉంటాది.. ఉంటాది. కొబ్బరికాయ డిమాండ్‌ తగ్గితే వెల్లులి డిమాండ్‌ పెరుగుతుంది. 


‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎత్తర జెండా పాటలో ఇంకెవరన్నా ఫ్రీడమ్‌ ఫైటర్‌ ఉంటే బాగుండేదా? 

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశంగారు. 


పవన్‌ సినిమాల్లో మీ ఫేవరెట్‌ సినిమా ఏది. 

జల్సా


తెలుగు చిత్రాల్లో వీఎఫ్‌ఎక్స్‌ బాగా ఉన్న సినిమాలు చెప్పండి? 

రెండు ఉన్నాయి. ఒకటి ‘బాహుబలి’, రెండోది మొన్ననే ఇద్దరితో కలిసి చూశా. పేరు గుర్తులేదు. 


రాయలసీమ మీద కాస్త దృష్టి పెట్టండి సార్‌. జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. 

తప్పకుండా. 


వైసీపీలో మిస్టర పర్ఫెక్ట్‌ అనిపించుకునే నాయకుడు ఎవరన్నా ఉన్నారా. 

దీనికి జవాబుగా ఆంబోతు బొమ్మను పోస్ట్‌ చేశారు నాగబాబు.


రూ.300 ఇంటి పన్ను కట్టలేదని 30 ఏళ్లుగా ఉంటున్న ఇంటిని సీజ్‌ చేశారు సర్‌. మీ అభిప్రాయం. 

ఏం చేయగలం నెత్తిన ఎక్కించుకున్నాక.  రానున్న ఎన్నికల కన్నా ఈ భారం దించుకుందాం. 


‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ గురించి ఒక్క మాటలో...

చెప్పను బ్రదర్‌. (పవన్ కల్యాణ్ గురించి అల్లు అర్జున్‌ని అడిగినప్పుడు చెప్పిన సమాధాన వీడియో)

 

రాజకీయాల విషయంలో యువతకు మీరిచ్చే సలహా? ఎందుకంటే ఈ పనికిమాలిన పాలిటిక్స్‌ను యువత మార్చగలరు కాబట్టి? 

అందరూ కాలేజ్‌ ఐడీతోపాటు ఓటర్‌ ఐడీ కూడా అప్లై చేస్తే చాలు. 


ఉచితాలు పేరుతో జనాలకు రూ.100 ఇచ్చి.. పన్నుల రూపంలో రూ.1000 వసూలు చేస్తున్నారు. అవేమీ జనాలకు కనిపించడం లేదా? 

మన ప్రభుత్వం తీరు అలా ఉంది. 


కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా చూశాక మీకేం అనిపించింది. 

ఆంధ్రా మూడు రాజధానులు ఫైల్స్‌ అని ఓ సినిమా తీస్తే చూడాలనుంది. 


జగన్‌ నెట్‌వర్క్‌ చాలా పెద్దది అంట కదా? 

మా సుడిగాలి సుధీర్‌ నెట్‌వర్క్‌ ముందు ఏదైనా జుజూబీ. రష్యా, ఉక్రెయన్‌ యుద్దం యూట్యూబ్‌ వీడియోల కింద కూడా మావాడి కామెంట్స్‌ ఉంటాయి తెల్సా. 


అన్నయ్య చిరంజీవి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే? 

మా అన్నయ్య ట్రూ మెగాస్టార్‌. (చిరంజీవి గురించి ఇటీవల రాజమౌళి మాట్లాడిన స్పీచ్ వీడియో పోస్ట్ చేశారు)  

Updated Date - 2022-03-23T00:13:45+05:30 IST