Nagababu: ‘ఇండస్ట్రీకి నం.1 హీరో కాకపోతే చూడండి’ అని ఆ రోజే అన్నారట

ABN , First Publish Date - 2022-08-22T02:37:08+05:30 IST

21 సంవత్సరాల వయసులో యాక్టింగ్‌ నేర్చుకోవడం, సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లిన చిరంజీవికి ఎదురైన సంఘటన గురించి నాగబాబు అభిమానులతో పంచుకున్నారు. ఆ విషయం చిరంజీవికి కూడా గుర్తులేదని ఆయన చెప్పారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మెగాస్టార్‌ బర్త్‌డే కార్నివాల్‌ వేదికపై నాగబాబు మాట్లాడారు.

Nagababu: ‘ఇండస్ట్రీకి నం.1 హీరో కాకపోతే చూడండి’ అని ఆ రోజే అన్నారట

21 సంవత్సరాల వయసులో యాక్టింగ్‌ నేర్చుకోవడం, సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లిన చిరంజీవికి(Chiranjeevi) ఎదురైన సంఘటన గురించి నాగబాబు (Nagababu memories)అభిమానులతో పంచుకున్నారు. ఆ విషయం చిరంజీవికి కూడా గుర్తులేదని ఆయన చెప్పారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మెగాస్టార్‌ బర్త్‌డే కార్నివాల్‌ వేదికపై నాగబాబు (Nagabbau)మాట్లాడారు. 


‘‘21 సంవత్సరాల వయసున్న ఓ యువకుడు ఒక అద్దె గదిలో ఇద్దరు స్నేహితుల (సుధాకర్‌, హరిప్రసాద్‌)తో కలిసి ఉంటున్న సమయమది. అప్పట్లో మాకేమీ తాతల పంచిన ఆస్తి లేదు. తండ్రి ఇచ్చిన కోట్లు లేదు. ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లో సాధారణ జీతానికి పనిచేసే ఓ పోలీస్‌ వ్యక్తి, నెలకు రూ.200 మద్రాస్‌ పంపిస్తే.. ఫిల్మ్‌ స్కూల్‌లో చేరి జీవనాన్ని సాగించిన వ్యక్తి మా అన్నయ్య. వాళ్ల గది పక్కనే పూర్ణ పిక్చర్స్‌ ఆఫీస్‌ ఉండేది. ఆ సంస్థ మేనేజర్‌ సుబ్రహ్మణ్యంగారు ఆయన భార్య సినిమాలంటే ఆసక్తి ఉన్న ఈ ముగ్గురిని ఇంట్లో బిడ్డల్లాగే చూసేవారు. వారి అబ్బాయి సూర్య కూడా ఈ ముగురితో స్నేహంగా ఉండేవాడు. ఓ రోజు ఆ ముగ్గురు స్నేహితులను పిలిచి ఓ ప్రివ్యూ చూడమని థియేటర్‌లో కూర్చొబెట్టారు. ఆ సినిమా హీరో, ఆయన తాలుక మనుషులు వచ్చారు. సీట్లు ఖాళీ లేకపోవడంతో అతిథులుగా వెళ్లిన చిరంజీవి, ఆయన మిత్రులను ఇద్దరినీ లేపి వెనుక నిలబెట్టారు. అలాగే నిలబడి సినిమా చూసి, పూర్తయ్యాక బయటకు వచ్చారు. సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి అన్నయ్యకు కబురు పంపింది ఆవిడ. అప్పటకే కోపంతో రగులుతున్న అన్నయ్యను సినిమా ఎలా ఉందని అడగగానే ‘సినిమా బాగానే ఉంది కానీ.. మీ తరఫున వెళ్లిన మమ్మల్ని హీరో తాలుక మనుషులు వచ్చారని గుమ్మం దగ్గర నిలబెట్టారు. బయటకు వస్తే మీకు చెడ్డ పేరు వస్తుందమో అని ఆలోచించాం ఆంటీ! వీళ్లందరికీ బాగా బలిసికొట్టుకుంటున్నారు అని అన్నయ్య అన్నాడట. ‘ఆ హీరో అంతేలేవయ్యా.. నువ్వు పట్టించుకోకు’ అని అందట ఆంటీ. లేదు అంటీ అదంతా అహంకారం. ‘చూస్తు ఉండండీ ‘ఈ ఇండస్ట్రీకి నంబర్‌వన్‌ హీరో కాకపోతే నన్ను అడగండి’ అని అన్నయ్య ఆరోజే అన్నాదట. ఆ విషయాన్నిసూర్య నాకు చెబతే షాకయ్యా.. ఇదే విషయం అన్నయ్యకు చెబితే నాకు గుర్తు లేదు అన్నాడు. సినిమాలో యాక్ట్‌ చేద్దామని వచ్చిన ఓ కుర్రాడికి జరిగిన అవమానం అది. అప్పటికే ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు వంటి స్టార్లు ఉన్న సమయంలో ‘నేనే నంబర్‌ వన్‌’ అవుతా అని ఓ కుర్రాడు అన్నాడంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది. యంగ్‌స్టర్స్‌కి చాలా గోల్స్‌ చాలా ఉంటాయి. మోటివేషన్‌, అఛీవ్‌ చేయాలనే తపనా ఉంటే తప్పకుండా సాధిస్తారు. అన్నయ్య, ఆయన లైఫ్‌ కన్నా గొప్ప మోటివేషన్‌ ఏదీ ఉండదు. యంగస్టర్స్‌ ఏదన్నా చేయాలనుకుంటే ఆలోచించండి.. సాధించడానికి ట్రై చేయండి.. చిరంజీవిగారిలా మీరు కూడా ఏదో ఒకరోజు సాధిస్తారు’’ అని నాగబాబు చెప్పారు. 


Updated Date - 2022-08-22T02:37:08+05:30 IST