Virataparvam: ఆకట్టుకుంటున్న 'నగాదారిలో' లిరికల్ వీడియో సాంగ్..

ABN , First Publish Date - 2022-06-03T18:18:14+05:30 IST

చాలా నెలలనుంచి అదిగో ఇదిగో అంటూ ప్రేక్షకులను ఊరిస్తున్న సినిమా విరాట పర్వం (Virata Parvam). ఎప్పటికప్పుడు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదల చేసేందుకు తేదీని ఖరారు చేసింది చిత్రబృందం.

Virataparvam: ఆకట్టుకుంటున్న 'నగాదారిలో' లిరికల్ వీడియో సాంగ్..

చాలా నెలలనుంచి అదిగో ఇదిగో అంటూ ప్రేక్షకులను ఊరిస్తున్న సినిమా విరాట పర్వం (Virata Parvam). రానా దగ్గుబాటి (Rana Daggubati)- సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో నటించగా ఎప్పటికప్పుడు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదల చేసేందుకు తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. జూన్ 17న రిలీజ్ చేయబోతున్నట్టు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాజాగా సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.


నిప్పూ ఉంది నీరూ ఉంది నగాదారిలో,

చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో.. 

ఒకరి కోసం బతికితే ప్రేమ, 

ప్రజల కోసం బతికితే విప్లవం, 

ప్రేమను మించిన ప్రజాస్వామిక విలువ ఉంటుందా... 



ఈ లైన్‌ను ట్వీట్ చేస్తూ చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల (Venu Udugula) 'విరాటపర్వం' (Virata Parvam) సినిమా నుంచి లేటెస్ట్ సాంగ్‌ను వదిలారు. తెలంగాణలో బాగా అలవాటైన 'నగాదారిలో' (Nagadarilo) అనే పదాన్ని తీసుకొన్ని రాసిన ఈ పాట వినడానికి చాలా బాగుంది. 'ప్రేమ కన్నా గొప్ప విప్లవం పుట్టలేదు'.. అంటూ సాగిన ఈ పాటకి సురేష్ బొబ్బిలి మంచి ట్యూన్ అందివ్వగా, నరేందర్-భరద్వాజ్ చక్కటి సాహిత్యం అందించారు. మంచి ట్యూన్ అండ్ లిరిక్స్‌కి సింగర్ వరం వాయిస్ కూడా బాగా సూటవడంతో 'నగాదారిలో' పాట అద్భుతంగా వచ్చింది. 


విరాటపర్వంలోని 'కోలు కోలోయమ్మ' సాంగ్ తర్వాత ఈ మధ్యలో మళ్ళీ అలాంటి ఆహ్లాదకరమైన పాటను వినలేదు. ఆ లోటుని 'నగాదారిలో' తీర్చేసింది. వినడానికే కాదు 'నగాదారిలో' లిరికల్ సాంగ్ చూడడానికి కూడా బాగుంది. సాయి పల్లవిని చూడడానికి ఈ సాంగ్‌ను రిపీట్ మోడ్‌లో వింటారు. రానా (Rana) - సాయి పల్లవి (Sai Pallavi) కలిసి కనిపించిన ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రియమణి (Priyamani), నందిత దాస్ (Nandita Das), నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. భీమ్లా నాయక్ తర్వాత రానా నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో ఎలాంటి హిట్ అందుకుంటారో అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.



Updated Date - 2022-06-03T18:18:14+05:30 IST