నాగశౌర్య ‘లక్ష్య’కు కొత్త విడుదల తేదీ ఖరారు

ABN , First Publish Date - 2021-11-24T22:39:44+05:30 IST

యంగ్ హీరో నాగశౌర్య 20వ చిత్రంగా.. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. ప‌తాకాల‌పై నారాయణ్ కె నారంగ్, పుస్కూరు రామ్‌ మోహన్ రావు, శరత్ మరార్

నాగశౌర్య ‘లక్ష్య’కు కొత్త విడుదల తేదీ ఖరారు

యంగ్ హీరో నాగశౌర్య 20వ చిత్రంగా.. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. ప‌తాకాల‌పై నారాయణ్ కె నారంగ్, పుస్కూరు రామ్‌ మోహన్ రావు, శరత్ మరార్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘లక్ష్య’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోలు సినిమాపై ఎటువంటి అంచనాలను క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రాన్ని నవంబర్ 12వ తేదీనే విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో.. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 10వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా చిత్రయూనిట్ బుధవారం ప్రకటించింది.


ఈ సందర్భంగా రిలీజ్ డేట్‌ ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఇందులో నాగశౌర్య విల్లు పట్టుకుని వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కండలు తిరిగిన దేహంతో.. విలు విద్యలో ఆరితేరిన ఆటగాడిగా ఈ సినిమాలో నాగ‌శౌర్య కనిపించనున్నాడనేది ఈ లుక్‌తో క్లియర్‌గా అర్థమవుతోంది. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. విలక్షణ నటుడు జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Updated Date - 2021-11-24T22:39:44+05:30 IST