Krishna Vrinda Vihari Trailer: అలా చంపేశారేంటి?

ABN , First Publish Date - 2022-09-11T02:51:57+05:30 IST

హీరో నాగశౌర్య (Naga Shaurya) నటించిన డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి’ (Krishna Vrinda Vihari). నాగశౌర్య సొంత నిర్మాణ సంస్థ ఐరా..

Krishna Vrinda Vihari Trailer: అలా చంపేశారేంటి?

హీరో నాగశౌర్య (Naga Shaurya) నటించిన డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి’ (Krishna Vrinda Vihari). నాగశౌర్య సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్‌ పతాకంపై అనీష్‌ ఆర్‌ కృష్ణ (Anish R Krishna) దర్శకత్వంలో ఉషా ముల్పూరి (Usha Mulpuri) నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో నాగశౌర్య కనిపించిన తీరు, హీరోయిన్, కామెడీ హైలెట్స్‌ అనేలా ఈ ట్రైలర్‌ చూస్తుంటే తెలిసిపోతుంది. సరికొత్త నాగశౌర్య ఇందులో కనిపిస్తున్నారు.  


ట్రైలర్ విషయానికి వస్తే.. కృష్ణ (నాగశౌర్య) అగ్రహారం బ్రాహ్మణ కుర్రాడు, ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం సంపాదించి సిటీకి వస్తాడు, అక్కడ అందమైన అమ్మాయి వ్రింద (షిర్లీ సెటియా)ని కలుస్తాడు. వ్రింద‌ని ఇష్టపడతాడు. ఆ  అమ్మాయిని ఆకర్షించడానికి కృష్ణ  చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వారిద్దరూ కలసి ప్రతి క్షణాన్ని ఆనందిస్తారు. కృష్ణది సనాతన కుటుంబం, వ్రింద మోడరన్ దుస్తులు ధరించే అర్బన్ గర్ల్. ఇది కాకుండా వీరి పెళ్లికి మరో సమస్య వుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతుంది. నాగశౌర్య ఫెర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్ అవుట్ స్టాండింగ్‌లా ఉంది. బ్రాహ్మణ గెటప్‌లో సాంప్రదాయకంగా కనిపిస్తూనే, ఫార్మల్స్.. ఫ్యాషన్ కాస్ట్యూమ్స్‌లో సూపర్ కూల్, ట్రెండీగా కనిపించాడు. షిర్లీ సెటియా గ్లామరస్‌గా కనిపించింది. వీరి కెమిస్ట్రీ కూడా చూడచక్కగా ఉంది. శౌర్యకు తల్లిగా రాధికా శరత్ కుమార్ (Radhika Sarathkumar) హుందాగా కనిపించింది. వెన్నెల కిషోర్ కోమాలో ఉన్నప్పటికీ తన ప్రజన్స్‌ని చాటుకున్నాడు. బ్రహ్మాజీ కెఎఫ్‌సి సీక్వెన్స్ హిలేరియస్‌గా ఉంది. ముఖ్యంగా రాహుల్ రామకృష్ణ, సత్య, నాగశౌర్యలు ఉన్నప్పుడు వచ్చే 3 ఇడియట్స్, ఇడియట్ డైలాగ్ ఈ ట్రైలర్‌కే హైలెట్ అనేలా ఉంది. చివరికి ట్రైలర్‌లో వెన్నెల కిషోర్‌ని చంపేసినట్లుగా వచ్చే సీన్ కూడా హిలేరియస్‌గా ఉంది. టోటల్‌గా ఐరా క్రియేషన్స్‌ నుంచి ఓ వినోదభరిత చిత్రం రాబోతున్నట్లుగా తెలియజేయడంతో ట్రైలర్ సక్సెస్ అయినట్లే. ఈ  చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. (Krishna Vrinda Vihari Trailer)





Updated Date - 2022-09-11T02:51:57+05:30 IST