Krishna Vrinda Vihari: సెకండ్ సాంగ్ ‘ఏముంది రా’

ABN , First Publish Date - 2022-05-04T23:48:20+05:30 IST

యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya), షిర్లీ సెటియా (Shirley Setia) హీరోహీరోయిన్లుగా అనీష్‌ ఆర్‌ కృష్ణ (Anish R Krishna) దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ (Ira Creations) పతాకంపై..

Krishna Vrinda Vihari: సెకండ్ సాంగ్ ‘ఏముంది రా’

యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya), షిర్లీ సెటియా (Shirley Setia) హీరోహీరోయిన్లుగా అనీష్‌ ఆర్‌ కృష్ణ (Anish R Krishna) దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ (Ira Creations) పతాకంపై.. నిర్మాత ఉషా మూల్పూరి (Usha Mulpuri) నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’ (Krishna Vrinda Vihari). ఈ చిత్రం మే 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ రెండో సింగిల్‪ను విడుదల చేశారు.


‘ఏముంది రా’ (Emundi Ra) అనే లిరిక్స్ తో వచ్చిన ఈ సాంగ్‪ని గాయకుడు హరిచరణ్ (Haricharan) ఆలపించగా.. హర్ష (Harsha) సాహిత్యం అందించారు. మహతి స్వర సాగర్ (Mahati Swara Sagar) వినసొంపైన సంగీతాన్ని అందించారు. అలాగే ఈ లిరికల్ వీడియోలో చూపించిన విజివల్స్ కూడా బ్యూటీఫుల్‪గా ఉన్నాయి. పాటలో నాగశౌర్య, షిర్లీని అగ్రహారానికి తీసుకురావడం, ఆమె సాంప్రదాయ బ్రాహ్మణ అమ్మాయిగా కనిపించడం, హల్దీ ఫంక్షన్ మొదలుకొని పెళ్లి, సీమంతం, పిల్లలు.. ఇలా హ్యాపీ మూమెంట్స్‪ని పాటలో చూపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. కాగా, డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ (Radhika Sarath Kumar) ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. 



Updated Date - 2022-05-04T23:48:20+05:30 IST