Naga Shaurya Wedding: గ్రాండ్‌గా నాగ శౌర్య - అనూష శెట్టి వివాహం

ABN , First Publish Date - 2022-11-20T18:28:02+05:30 IST

టాలీవుడ్‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకరైన యువ నటుడు నాగశౌర్య (Naga Shaurya) ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు..

Naga Shaurya Wedding: గ్రాండ్‌గా నాగ శౌర్య - అనూష శెట్టి వివాహం

టాలీవుడ్‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకరైన యువ నటుడు నాగశౌర్య (Naga Shaurya) ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి (Anusha Shetty)తో ఆయన వివాహం (Wedding) నేడు (నవంబర్ 20)న ఉదయం 11.25 గంటలకు బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. బెంగుళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకకి ఎంతోమంది టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.


నాగశౌర్య, అనూష పెళ్లి వేడుకకి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమకి చెందిన ఓ వ్యక్తి ఈ వీడియోలని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఎంతోమంది నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా ఈ నూతన దంపతులకు విషెస్ చెబుతున్నారు.  కాగా ఇంటీరియర్ డిజైనర్‌గా పలు అవార్డులను అందుకున్న అనూష శెట్టి‌తో నాగ శౌర్యకి కొన్నేళ్లుగా స్నేహం ఉంది. ఆ స్నేహం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి తాజాగా పెళ్లి బంధంతో ఒకటయ్యారు.





Updated Date - 2022-11-20T18:28:02+05:30 IST