Naga Chaithanya: అందుకే హిందీ సినిమాలకు నో చెప్పాను..

ABN , First Publish Date - 2022-08-03T14:34:22+05:30 IST

అక్కినేని నాగ చైతన్య (Naga Chaithanya) హీరోగా నటించిన బాలీవుడ్ మొదటి సినిమా 'లాల్ సింగ్ చడ్డా' (Laal sing chaddha). ఆమిర్ ఖాన్ (Amir Khan), కరీన కపూర్ (Kareena Kapoor) ప్రధాన పాత్రల్లో నటించారు.

Naga Chaithanya: అందుకే హిందీ సినిమాలకు నో చెప్పాను..

అక్కినేని నాగ చైతన్య (Naga Chaithanya) హీరోగా నటించిన బాలీవుడ్ మొదటి సినిమా 'లాల్ సింగ్ చడ్డా' (Laal sing chaddha). ఆమిర్ ఖాన్ (Amir Khan), కరీన కపూర్ (Kareena Kapoor) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలకి సిద్దమవుతోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సమర్పణలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు నాగ చైతన్య. దీనిలో భాగంగా బాలీవుడ్ మూవీ ఆఫర్ వస్తే ఇంతకాలం ఎందుకు నో చెప్పారో క్లారిటీ ఇచ్చారు. చైతు ఇటీవలే విక్రమ్ కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన 'థాంక్యూ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 


భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దాంతో నెక్స్ట్ సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు చైతు. ఇందులో బోడి బాలరాజు అనే పాత్ర చేశారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన నాగ చైతన్య.. "నిజానికి  ఇంతకముందే నాకు కొన్ని బాలీవుడ్ సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. అయితే, నేను పుట్టిపెరిగిందంతా చెన్నై. ఆ తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాము. నాకు హిందీ పెద్దగా అలవాటు కాలేదు.


హిందీ భాషపై నాకు పెద్దగా పట్టులేదు. అందుకే, ఇంతకాలం వచ్చిన బాలీవుడ్ సినిమాలకి నో చెప్పాను".. అని అన్నారు. "ఇక ఇప్పుడు చేసిన లాల్ సింగ్ చడ్డా విషయంలో కూడా నేను ముందు నో అనే చెప్పాను. అయితే, ఇందులో బాలరాజు క్యారెక్టర్ సౌత్ నుండి నార్త్ వెళ్లిన ఆర్మీ వ్యక్తి ఇతివృత్తంతో సాగుతుంది. అలాగే, కథలో భాగంగా కొన్ని సీన్స్ లో తెలుగు పదాలు డైలాగ్స్ గా వస్తాయి. అందుకే, లాక్ సింగ్ చడ్డా ఒప్పుకున్నాను" అని క్లారిటీ ఇచ్చారు నాగ చైతన్య. చూడాలి మరి మొదటి బాలీవుడ్ ఎంట్రీ మూతో చైతూ ఎలాంటి హిట్ అందుకుంటారో. 

Updated Date - 2022-08-03T14:34:22+05:30 IST