Naga Chaithanya: ఆ దర్శకుడితో సినిమా ఉందా లేదా..?

ABN , First Publish Date - 2022-08-20T17:56:28+05:30 IST

అక్కినేని నాగ చైతన్య (Akkineni Nagachaitanya), దర్శకుడు పరశురామ్ (Parasuram) కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా మాత్రం

Naga Chaithanya: ఆ దర్శకుడితో సినిమా ఉందా లేదా..?

అక్కినేని నాగ చైతన్య (Akkineni Nagachaitanya), దర్శకుడు పరశురామ్ (Parasuram) కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా మాత్రం ఈ కాంబోలో సినిమా క్యాన్సిల్ అయిందని సమాచారం. వాస్తవంగా అయితే, పరశురామ్, నాగ చైతన్య సినిమా ఎప్పుడో రావాల్సింది. కథా చర్చలు కూడా జరిగాయి. 14 ప్లస్ రీల్స్ సంస్థలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ మూవీని నిర్మించాలని ప్లాన్ చేశారు. కానీ, ఎందుకో ఈ సినిమా హోల్డ్‌లో పడింది. 


ఇంతలో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేసే అవకాశం అందుకున్నాడు పరశురామ్. దీని తర్వాత నాగ చైతన్యతో సినిమా ఉంటుందని అన్నారు. కానీ, సర్కారు వారి పాట ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ ప్రభావం వల్లే ఇప్పుడు చైతుతో సినిమా క్యాన్సిల్ అయిందని చెప్పుకుంటున్నారు. నాగ చైతన్య ఇటీవల థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, సరైన కథ, కథానాలు లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.


ఇప్పుడు చైతు కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాడట. త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇస్తూ చేసిన దూత వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అప్‌డేట్ రాబోతుందని సమాచారం. ఇక కొత్త సినిమా విషయానికొస్తే తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేయబోతున్నాడు చైరు. ఇప్పటికే, అధికారికంగానూ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. మరి చైతు నిజంగానే పరశురామ్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టాడా లేదా అనేది అఫీషియల్‌గా క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది. 

Updated Date - 2022-08-20T17:56:28+05:30 IST