Naga Chaithanya 'దూత' వచ్చేది అప్పుడే..

ABN , First Publish Date - 2022-07-20T14:41:04+05:30 IST

అక్కినేని నాగ చైతన్య (Naga chaithanya) తాజాగా నటించిన మూవీ థాంక్యూ (Thankyou). విక్రమ్ కె కుమార్ (Vikram k Kumar) తెరకెక్కించిన ఈ సినిమాలో రాశిఖన్నా (Rashi Khanna),

Naga Chaithanya 'దూత' వచ్చేది అప్పుడే..

అక్కినేని నాగ చైతన్య (Naga chaithanya) తాజాగా నటించిన మూవీ థాంక్యూ (Thankyou). విక్రమ్  కె కుమార్ (Vikram k Kumar) తెరకెక్కించిన ఈ సినిమాలో రాశిఖన్నా (Rashi Khanna), మాళవిక నాయర్ (Malavika Nair) హీరోయిన్స్ గా నటించారు. అవికా గోర్ చైతు చెల్లిగా కనిపించబోతుంది. దిల్ రాజు నిర్మించారు. మంచి హార్ట్ టచింగ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన థాంక్యూ మూవీ ఈనెల 22న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు నాగచైతన్య. 


ఈ నేపథ్యంలో థాంక్యూ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో షేర్ చేసుకున్న నాగ చైతన్య, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న వెబ్ సిరీస్ దూత గురించి కూడా పలు విషయాలు చెప్పారు. ఈ సందర్భంగా.. 'నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సూపర్ నాచురల్ వెబ్ సిరీస్ లో నాకు హీరోయిన్ ఉండదు.. ఆకట్టుకునే కథ, కథనాలతో ఈ వెబ్ సిరీస్ ని దర్శకడు విక్రమ్ కుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. దూత షూట్ దాదాపు పూర్తి కావచ్చింది. వచ్చే ఏడాది జనవరి తరువాత ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు అందుబాటులోకి రానుంది'..అని చెప్పారు చైతన్య.


కాగా, దూత వెబ్ సిరీస్ ని ప్రముఖ ఒటీటీ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేయబోతుంది. లవ్ స్టోరి, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న చైతు..ఇప్పుడు థాంక్యూ సినిమాతోనూ హిట్ అందుకుంటాననే గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా రిలీజైయ్యాక తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించబోతున్నారు.

Updated Date - 2022-07-20T14:41:04+05:30 IST