భన్సాలీతో నాగచైతన్య?

ABN , First Publish Date - 2022-08-07T05:30:00+05:30 IST

బాలీవుడ్‌ మొత్తం తెలుగు సినిమాల వైపు చూస్తోంది. తెలుగు హీరోలతో సినిమాలు చేయాలని అక్కడి దర్శకులు కథలు సిద్ధం చేసుకుంటారు. నిర్మాతలు..

భన్సాలీతో నాగచైతన్య?

బాలీవుడ్‌ మొత్తం తెలుగు సినిమాల వైపు చూస్తోంది. తెలుగు హీరోలతో సినిమాలు చేయాలని అక్కడి దర్శకులు కథలు సిద్ధం చేసుకుంటారు. నిర్మాతలు అడ్వాన్సులతో రెడీగా ఉన్నారు. కథ కుదరాలే కానీ, చాలా కాంబినేషన్లు సెట్టయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాంటి వాటిలో సంజయ్‌లీలా భన్సాలీ - నాగచైతన్యల కాంబో ఒకటి ఉంది.


‘లాల్‌ సింగ్‌ చద్దా’తో నాగ చైతన్య బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో బాలరాజుగా కనిపించనున్నాడు. అమీర్‌ఖాన్‌ సినిమా అవ్వడంతో ‘లాల్‌ సింగ్‌...’ కి మంచి మైలేజీ వచ్చింది. చైతూ పేరు కూడా బాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది. చైతూతో సినిమాలు చేయడానికి ఒకరిద్దరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు కూడా. ఇటీవల సంజయ్‌ లీలా భన్సాలీ - నాగ చైతన్య మధ్య ఓ మీటింగ్‌ జరిగింది. దాంతో చైతూతో భన్సాలీ సినిమా ఉండొచ్చన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయం గురించి అటు భన్సాలీ గానీ, ఇటు నాగచైతన్య గానీ ఏ వివరాలూ చెప్పడం లేదు. ఆమధ్య అల్లు అర్జున్‌తో కూడా ఇలానే భన్సాలీ భేటీ వేశారు. అప్పుడు కూడా వారిద్దరి కాంబినేషన్‌లో ఓసినిమా వస్తుందని వార్తలొచ్చాయి. ఈసారీ అంతే. మరి.. ఏం జరుగుతుందో చూడాలి. 

Updated Date - 2022-08-07T05:30:00+05:30 IST