Naga chaitanya: ఇప్పుడు బయటకు చెప్పగలుగుతున్నా

ABN , First Publish Date - 2022-07-21T20:05:19+05:30 IST

‘థ్యాంక్యూ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం విజయవాడలో సందడి చేశారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా గురువారం విజయవాడలో హీరో నాగచైతన్య, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌, దర్శకుడు విక్రమ్‌ కుమార్‌, రచయిత బీవీఎస్‌ రవి మీడియాతో ఇంటరాక్ట్‌ అయ్యారు.

Naga chaitanya: ఇప్పుడు బయటకు చెప్పగలుగుతున్నా

‘థ్యాంక్యూ’ (Thank you)సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం విజయవాడలో సందడి చేశారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా గురువారం విజయవాడలో హీరో నాగచైతన్య(Naga chaitnaya), మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌, దర్శకుడు విక్రమ్‌ కుమార్‌(Vikram k kumar), రచయిత బీవీఎస్‌ రవి మీడియాతో ఇంటరాక్ట్‌ అయ్యారు. 


‘‘నాకు కుటుంబ కథా చిత్రాలంటే చాలా ఇష్టం. అభిమానుల కోసం ప్రతిసారీ కొత్తగా ట్రై చేయాలనుంటుంది. అలా చేసిందే ఈ సినిమా. అభిరామ్‌, ప్రియా అనే పాత్రలు సినిమాను నడిపిస్తాయి. మన జీవితంలో ఎవరెవరికో థ్యాంక్యూ చెప్పాలని చెప్పలేకపోతున్నాం. ఈ సినిమా చూశాక కచ్చితంగా వారిని గుర్తు చేసుకొని థ్యాంక్స్‌ చెబుతాం. ఈ చిత్రం నన్ను చాలా మార్చింది. వ్యక్తిగతంగానూ చాలా మారాను. ఒకప్పుడు నా మనసులో భావాల్ని లోపలే దాచేకునేవాడిని ఇప్పుడు బయటకు చెప్పగలుగుతున్నా’’ అని నాచైతన్య అన్నారు. 


ఇప్పటి ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలు ప్రేక్షకలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘మనం’ చిత్రం తర్వాత చైతూ, విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నెల 22న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. (Thank you on 22 july).


Updated Date - 2022-07-21T20:05:19+05:30 IST