Naga Chaitanya: సమంతతో కలిసి సినిమా చేయడం గురించి చై ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2022-08-01T17:07:05+05:30 IST

టాలీవుడ్‌ యంగ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే...

Naga Chaitanya: సమంతతో కలిసి సినిమా చేయడం గురించి చై ఏమన్నాడంటే..

టాలీవుడ్‌ యంగ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమీర్ ఖాన్ (Aamir Khan) హీరోగా చేసిన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాలో చై ఓ ముఖ్య పాత్రలో నటించాడు. హాలీవుడ్‌ మూవీ ‘ఫారెస్ట్ గంప్‌’కి రిమేక్‌‌గా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఇంటర్వ్వూలో సమంత (Samantha)తో విడాకులపై చై స్పందించాడు.


తాజాగా బాలీవుడ్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’కి సమంత గెస్ట్‌గా వెళ్లింది. ఆ షోలో హోస్ట్‌ కరణ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా విడాకులపై స్పందించింది. దీంతో టాలీవుడ్‌లో ఈ నటుల డైవోర్స్‌(Divorce) విషయం మరోసారి చర్చకు వచ్చింది. సమంత ఇప్పటికే పలు సందర్భాల్లో విడాకులపై స్పందించింది. అయితే.. నాగచైతన్య మాత్రం మౌనం వహిస్తూ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. కానీ.. తాజాగా ‘లాల్ సింగ్ చద్ధా’ ప్రమోషన్స్ కోసం జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలో సమంతతో విడాకులపై చై స్పందించాడు.


చైతన్య ఓ ఇంటర్వ్వూలో మాట్లాడుతూ.. ‘మేమిద్దరం విడాకులపై ఏం చెప్పాలనుకున్నామో.. ఇప్పటికే చెప్పేశాం. మంచైనా, చెడైనా నేను మీడియాకు సమాచారం ఇచ్చే జీవితంలో ముందడుగు వేశాను. విడాకుల తర్వాత సమంత తన పనిలో బిజీగా మారిపోయింది. నేను కూడా కెరీర్‌పై దృష్టి సారిస్తూ ముందుకు సాగుతున్నా. అంతకుమించి ఈ ప్రపంచానికి తానేం చెప్పాలనుకోవడం లేదు. చెప్పాల్సి అవసరం కూడా లేదు. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, నా చుట్టూ ఉన్న వాళ్లందరికీ విషయం ఏంటో తెలుసు’ అని చెప్పుకొచ్చాడు.


మరో ఇంటర్వ్యూలో చైని ‘అవకాశం వస్తే మీ మాజీ భార్య సమంతతో కలిసి సినిమా చేస్తారా?’ అని అడగగా.. ‘అది జరిగితే చాలా క్రేజీగా ఉంటుంది. కానీ.. జరుగుతుందో లేదో నాకు తెలియదు. ఈ యూనివర్స్‌కి మాత్రమే అన్ని తెలుసు. ఏం జరుగుతుందో చూద్దాం. నాకైతే ఎటువంటి సమస్య లేదు’ అని చై తెలిపాడు.

Updated Date - 2022-08-01T17:07:05+05:30 IST