Naga Chaitanya: ‘లాల్ సింగ్ చడ్డా’ నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవడంపై స్పందించిన నాగచైతన్య

ABN , First Publish Date - 2022-08-09T00:34:33+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). టామ్ హ్యాంక్స్ నటించిన ‘ఫారెస్ట్ గంప్’ కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో కరీనా కపూర్ (Laal

Naga Chaitanya: ‘లాల్ సింగ్ చడ్డా’ నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవడంపై స్పందించిన నాగచైతన్య

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తాజాగా నటించిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). టామ్ హ్యాంక్స్ నటించిన ‘ఫారెస్ట్ గంప్’ కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో కరీనా కపూర్ (Laal Singh Chaddha), నాగ చైతన్య (Naga Chaitanya) కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియాగా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాగచైతన్య ప్రమోషన్స్‌ను వేగవంతం చేశాడు. అందులో భాగంగా మీడియా అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. 


‘లాల్ సింగ్ చడ్డా’ లో నాగచైతన్య పాత్రకు ముందుగా విజయ్ సేతుపతిని (Vijay Sethupathi) అనుకున్నారు. చిత్ర బృందం కూడా అతడు నటిస్తున్నాడని అధికారికంగా ప్రకటించింది. ఏమైందో తెలియదు కానీ ఈ సినిమా నుంచి అతడు తప్పుకొన్నాడు. అనంతరం ఈ పాత్రలో నటించే అవకాశం నాగచైతన్యకు దక్కింది. ఈ చిత్రంలో అతడు ఆర్మీ అధికారిగా నటించాడు. విజయ్ సేతుపతి ఎందుకు తప్పుకొన్నారని అడగగా తాజాగా నాగచైతన్య స్పందించాడు. ‘‘నిజం చెప్పాలంటే విజయ్ సర్ ఎందుకు తప్పుకొన్నారో నాకు తెలియదు. చిత్ర బృందం మాత్రం డేట్స్ ఇష్యూ వల్ల తప్పుకొన్నారని చెప్పింది. విజయ్ గారిని అనుకున్నప్పుడు అతడి బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఆ పాత్రను రాశారు. నేను ఈ చిత్రంలోకి రాగానే నా బాడీ లాంగ్వేజ్ కు తగినట్లుగా పాత్రలో మార్పులు చేశారు’’ అని నాగ చైతన్య పేర్కొన్నాడు. ‘లాల్ సింగ్ చడ్డా’ కు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. అతుల్ కులకర్ణి స్క్రీన్ ప్లేను అందించాడు. వయాకాం 18స్టూడియోస్‌తో కలసి ఆమిర్ సొంత నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.   

Updated Date - 2022-08-09T00:34:33+05:30 IST