Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. ఫాలో కావద్దు..

ABN , First Publish Date - 2022-08-10T22:31:09+05:30 IST

టాలీవుడ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) తాజాగా నటించిన సినిమా ‘‘లాల్ సింగ్ చడ్డా’’ (Laal Singh Chaddha). ఈ చిత్రం పాన్ ఇండియగా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల

Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. ఫాలో కావద్దు..

టాలీవుడ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) తాజాగా నటించిన సినిమా ‘‘లాల్ సింగ్ చడ్డా’’ (Laal Singh Chaddha). ఈ చిత్రం పాన్ ఇండియగా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా తన ఎడమ చేతి మీద టాటూ గురించి వివరించాడు. 


తన ఎడమ చేతి మీది పచ్చబొట్టును చూసి కొంత మంది అభిమానులు ఆ విధంగానే వేయించుకున్నారని నాగ చైతన్య తెలిపాడు. ‘‘నేను కొంత మంది అభిమానులను కలుసుకున్నాను. నా పేరును వారు టాటూగా వేసుకున్నారు. కానీ, నా ఎడమ మోచేతి మీద ఉన్న పచ్చ బొట్టును వేయించుకోవద్దని వారించాను. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్న తేదీని మోర్స్ కోడ్ రూపంలో టాటూగా వేయించుకున్నాను. అభిమానులు ఆ తేదీని టాటూగా వేయించుకున్నప్పుడు బాధ కలుగుతుంది. నేను ఇప్పటి వరకు టాటూను తొలగించాలని ఆలోచించలేదు’’ అని నాగచైతన్య తెలిపాడు. సమంత (Samantha) ను చై 2017లో పెళ్లి చేసుకున్నాడు. దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో 2021లో విడాకులు తీసుకున్నారు. చైతో విడిపోయిన అనంతరం విడాకుల గురించి సమంత అనేక సార్లు మాట్లాడింది. తాజాగా ‘కాఫీ విత్ కరణ్ -7’ లో సామ్ పాల్గొంది. ఈ అంశంపై కూడా స్పందించింది. ‘‘మా ఇద్దరిని ఒకే రూంలో ఉంచితే పదునైన వస్తువులను మాకు కనిపించకుండా ఉంచాలి. ప్రస్తుతం మా ఇద్దరి మధ్య స్నేహాపూర్వక వాతారవరణం లేనప్పటికీ భవిష్యత్తులో మారే అవకాశం ఉంది’’ అని సమంత స్పష్టం చేసింది. ఇక నాగచైతన్య కెరీర్ విషయానికి వస్తే.. ‘థ్యాంక్యూ’ లో చివరగా కనిపించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. పరశురాం డైరెక్షన్‌లోను ఓ చిత్రం చేయనున్నాడు.     


Updated Date - 2022-08-10T22:31:09+05:30 IST