Laal Singh Chaddha: అమీర్ ఖాన్ గురించి ఒక్క మాట మాత్రం కచ్చితంగా చెప్పగలనంటూ Naga Chaithanya కామెంట్స్ ఇవీ..!

ABN , First Publish Date - 2022-05-30T19:45:00+05:30 IST

టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న యువ నటుల్లో నాగ చైతన్య (Naga Chaitanya) ఒకరు. అక్కినేని కుటుంబ వారసుడిగా పరిశ్రమకి..

Laal Singh Chaddha: అమీర్ ఖాన్ గురించి ఒక్క మాట మాత్రం కచ్చితంగా చెప్పగలనంటూ Naga Chaithanya కామెంట్స్ ఇవీ..!

టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న యువ నటుల్లో నాగ చైతన్య (Naga Chaitanya) ఒకరు. అక్కినేని కుటుంబ వారసుడిగా పరిశ్రమకి పరిచయమై తనకంటూ పొందిన ఈ నటుడు తాజాగా ఓ బాలీవుడ్ చిత్రం చేస్తున్నాడు. అదే ఆమీర్‌ఖాన్ హీరోగా నటించిన ‘లాల్‌సింగ్ చద్ధా (Laal Singh Chaddha)’ సినిమా. చాలా గ్యాప్ తర్వాత ఆమీర్ చేస్తున్న ఈ మూవీలో కరీనా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో నాగచైతన్య సైతం ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్‌ని చిత్రబృందం తాజాగా విడుదల చేయగా మంచి రెస్పాన్స్‌ని అందుకుంది. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో మూవీ టీం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ ఆమీర్ ఖాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


ఈ ఇంటర్వ్యూ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘నేను గత 12 సంవత్సరాల్లో నేర్చుకున్నది.. ఆమీర్ దగ్గర 45 రోజుల్లోనే నేర్చుకున్నా. ఆ విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పగలను. నిజం చెప్పాలంటే.. ఆయన నాకు అంతకంటే ఎక్కువే నేర్పించాడు. ఎటువంటి ప్రయత్నాలను చేయకుండానే ఇతరులను ప్రభావితం చేయగల టాలెంట్ ఆయనకి ఉంది. మొదట ఆయన నటుడు. కానీ.. ఆయనకి ఇతర అంశాల మీద కూడా మంచి పట్టుంది. అది నిజంగా అద్భుతం. సినిమాలో ఆమీర్ మొదట చూసేది కంటెంట్‌నే. అందుకే సమయంలో దొరికితే కథ గురించే మాట్లాడుతాడు. అంతేకానీ.. బాక్సాఫీస్ వద్ద ఎన్ని కలెక్షన్లు సాధిస్తుంది అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. సినిమా ప్రారంభం నుంచి షూటింగ్ పూర్తయ్యే వరకూ దానికే కట్టుబడి ఉంటాడు’ అని చెప్పుకొచ్చాడు.



Updated Date - 2022-05-30T19:45:00+05:30 IST