Naga Chaitanya: సమంతతో విడాకులపై జాతీయ మీడియాతో నాగచైతన్య తొలిసారిగా ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2022-08-01T03:11:33+05:30 IST

‘ఏ మాయ చేశావే’ సినిమాతో దగ్గరై.. పెళ్లి చేసుకున్న కొన్నేళ్లకే తమ వైవాహిక ‘మజిలీ’ ముగించిన సమంత, నాగచైతన్య విడాకుల అంశం ఈ మధ్య మళ్లీ తరచూ వార్తల్లో..

Naga Chaitanya: సమంతతో విడాకులపై జాతీయ మీడియాతో నాగచైతన్య తొలిసారిగా ఏమన్నాడంటే..

‘ఏ మాయ చేశావే’ సినిమాతో దగ్గరై.. పెళ్లి చేసుకున్న కొన్నేళ్లకే తమ వైవాహిక ‘మజిలీ’ ముగించిన సమంత, నాగచైతన్య విడాకుల అంశం ఈ మధ్య మళ్లీ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఓ బాలీవుడ్ టాక్ షోలో విడాకులపై సమంత స్పందించడంతో మరొక్కసారి వీరి విడాకుల గురించి వార్తలు వస్తున్నాయి. విడాకుల తర్వాత సమంత పలుమార్లు స్పందించినప్పటికీ నాగచైతన్య మాత్రం మౌనం వహిస్తూ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. కానీ.. తాజాగా ‘లాల్ సింగ్ చద్ధా’ ప్రమోషన్స్ కోసం జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న సందర్భంలో నాగచైతన్యను సమంతతో విడాకుల గురించి మరోమారు విలేకరులు ప్రశ్నించారు. తన విడాకులపై వివాదాలకు దూరంగా ఉండాలని మొదటి నుంచి భావిస్తున్న నాగచైతన్య తాజాగా కూడా అంతే స్పందించారు. జాతీయ మీడియా విడాకుల గురించి అడగ్గా.. తామిద్దరం విడాకులపై ఏం చెప్పాలనుకున్నామో.. ఇప్పటికే చెప్పేశామని నాగచైతన్య తెలిపాడు.



మంచైనా, చెడైనా తాను మీడియాకు సమాచారం ఇచ్చే జీవితంలో ముందుకెళ్లానని చెప్పాడు. విడాకుల తర్వాత సమంత మరో ముందడుగు వేసిందని, తాను కూడా తన పని తాను చేసుకుంటూ సాగిపోతున్నానని వెల్లడించాడు. అంతకు మించి ఈ ప్రపంచానికి తానేం చెప్పాలనుకోవడం లేదని  నాగచైతన్య స్పష్టం చేశాడు. తన స్నేహితులు, కుటుంబం, తన చుట్టూ ఉన్న వాళ్లందరికీ విషయం ఏంటో తెలుసని చెప్పాడు. వార్తను మరో వార్త భర్తీ చేస్తుందని.. ఇప్పుడు తన విడాకులపై వచ్చే పుకార్లన్నీ తాత్కాలికమైనవని నాగచైతన్య అభిప్రాయపడ్డాడు.

Updated Date - 2022-08-01T03:11:33+05:30 IST