Naga Chaitanya: శోభితా ధూళిపాళ గురించి అడిగితే.. చై రియాక్షన్ ఇదే..

ABN , First Publish Date - 2022-08-02T22:01:24+05:30 IST

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య బాలీవుడ్‌‌కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న..

Naga Chaitanya: శోభితా ధూళిపాళ గురించి అడిగితే.. చై రియాక్షన్ ఇదే..

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య  (Naga Chaitanya) బాలీవుడ్‌‌కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆమీర్ ఖాన్(Aamir Khan), కరీనా కపూర్ జంటగా నటిస్తున్న ‘లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha)’లో చై ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. బాలరాజు బోడి క్యారెక్టర్‌లో చై నటిస్తున్న ఈ మూవీ 1994లో వచ్చిన హాలీవుడ్‌ మూవీ ఫారెస్ట్ గంప్‌కి రిమేక్‌గా తెరకెక్కింది. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ తరుణంలో ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


గత ఏడాది సమంతతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి దాదాపు ప్రతిరోజు ఏదో ఒక వార్తతో చై వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా అడివి శేష్ సినిమా ‘గూడఛారి’తో పాపులారిటీ సాధించిన శోభితా దూళిపాళ(Sobhita Dhulipala)తో చై రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఎప్పటి నుంచో ఈ వార్తలు వస్తున్నప్పటికీ ఈ నటులిద్దరూ ఈ న్యూస్‌పై స్పందించలేదు. కానీ.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో శోభిత గురించి చై మాట్లాడాడు.


‘లాల్ సింగ్ చడ్డా’ ప్రమోషన్స్‌లో భాగంగా సిద్ధార్థ్ కన్నన్ అనే యూట్యూబ్‌ ఛానెల్‌కి చై ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో హోస్ట్ సిద్ధార్థ్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ నిర్వహిస్తూ.. పర్సన్ పేరు చెప్పగానే మీ బ్రెయిన్‌లో ఏం రన్‌ అవుతుందో చెప్పండి అని అడిగాడు. విజయ్ దేవరకొండ అనగా.. క్రేజీ అని చై చెప్పాడు. అలాగే.. రాశిఖన్నా పేరు చెప్పగా.. మంచి ఫ్రెండ్ అని తెలిపాడు. కృతి శెట్టి పేరు చెప్పగా.. చిన్న పాప అని చెప్పుకొచ్చాడు. కానీ.. శోభితా దూళిపాళ పేరు చెప్పగా చై ఏం మాట్లకుండా ముందు గట్టిగా నవ్వేశాడు. అనంతరం.. ‘కేవలం నవ్వుతాను’ అని చై తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో పలువురు హిందీ వ్యూవర్స్ స్పందిస్తూ.. ‘శోభిత పేరు చెబితే చై నవ్వుతున్నాడు. అంటే వాళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారా?’ అని కామెంట్ చేస్తున్నారు.



Updated Date - 2022-08-02T22:01:24+05:30 IST