సమంతతో విడాకులపై మొదటిసారి నాగచైతన్య కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-01-13T03:52:39+05:30 IST

సమంతతో విడాకుల అనంతరం ఇప్పటి వరకు ఎక్కడా ఈ విషయంపై మాట్లాడని నాగచైతన్య.. బుధవారం జరిగిన ‘బంగార్రాజు’ ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మా మంచి కోసం ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయమది. విడాకుల అనంతరం

సమంతతో విడాకులపై మొదటిసారి నాగచైతన్య కీలక వ్యాఖ్యలు

సమంతతో విడాకుల అనంతరం ఇప్పటి వరకు ఎక్కడా ఈ విషయంపై మాట్లాడని నాగచైతన్య.. బుధవారం జరిగిన ‘బంగార్రాజు’ ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మా మంచి కోసం ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయమది. విడాకుల అనంతరం తను హ్యాపీగా ఉంది. నేను కూడా హ్యాపీగా ఉన్నా. కెరీర్ పరంగా చూసినా ఇద్దరం హ్యాపీగానే ఉన్నాం. విడాకుల సమయంలో కుటుంబమంతా మాకు అండగా నిలిచింది..’’ అని తెలిపారు. ప్రస్తుతం నాగచైతన్య నటించిన ‘బంగార్రాజు’ చిత్రం విడుదలకు సిద్ధమవగా.. ‘థ్యాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రాలు చివరి దశలో ఉన్నాయి. విజయ్ కనకమేడల దర్శకత్వంలో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక సమంత కూడా ‘శాకుంతలం’ పూర్తి చేసి.. ‘యశోద’ షూటింగ్‌లో బిజీగా ఉంది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషలలో మరికొన్ని చిత్రాలకు ఆమె సైన్ చేశారు. 

Updated Date - 2022-01-13T03:52:39+05:30 IST