Project K: రేంజ్ పెంచేస్తోన్న నాగీ

ABN , First Publish Date - 2022-05-13T05:27:10+05:30 IST

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఒక మూవీ చేస్తున్నాడు అంటే.. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మరో పాన్ ఇండియన్ మూవీ వస్తున్నట్లే. హై బడ్జెట్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్న ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్రాజెక్ట్ K’ (Project K). ‘మహానటి’ (Mahanati) దర్శకుడు

Project K: రేంజ్ పెంచేస్తోన్న నాగీ

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఒక మూవీ చేస్తున్నాడు అంటే.. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మరో పాన్ ఇండియన్ మూవీ వస్తున్నట్లే. హై బడ్జెట్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్న ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్రాజెక్ట్ K’ (Project K). ‘మహానటి’ (Mahanati) దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై.. ప్రకటన వచ్చినప్పటి నుండే అంచనాలు భారీగా ఉన్నాయి. ‘ప్రాజెక్ట్ K’ అంటే ప్రాజెక్ట్ కల్కి (Project Kalki) అనే టాక్ ఇండస్ట్రీలో మరియు అభిమానుల్లో ఉంది. ప్రాజెక్ట్ K పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా, నాగ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా రేంజ్ మారుస్తున్నాడు. హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్‌ని ఈ చిత్రం కోసం పని చేయిస్తూ, రోజు రోజుకీ అంచనాలు పెంచుతున్నారు. 


టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఒక విభిన్నమైన ఊహా లోకానికి ప్రేక్షకులను తీసుకెళ్లేలా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ సినిమా టెక్నికల్ వ్యాల్యూస్‌ని యాడ్ చేస్తూ మేకింగ్ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా లార్జ్ స్కేల్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అమితాబచ్చన్ (Amitabh bachchan), దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పటానీ (Disha Patani) వంటి వారు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ప్రభాస్ మరియు దీపికా పదుకొనే కాంబోలో ఇప్పటి వరకు షూట్ చేసిన సన్నివేశాలు మరియు కొన్ని సైన్స్ పిక్షన్ సన్నివేశాలు అద్బుతంగా వచ్చాయంటున్నారు. టాలీవుడ్‌లో క్రియేటివ్ అండ్ లార్జర్ దెన్ లైఫ్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) ఈ సినిమాకి మెంటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఒక విజువల్ వండర్‌లా తీర్చిదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఇండియాలోనే కాకుండా విదేశీ భాషల్లో కూడా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Updated Date - 2022-05-13T05:27:10+05:30 IST