పెళ్లి చేసుకొబోతున్న బాలీవుడ్ బ్యూటీ.. డేట్ ఫిక్స్..

ABN , First Publish Date - 2022-01-12T22:00:10+05:30 IST

బాలీవుడ్‌లో గతేడాది ఎక్కడ చూసినా పెళ్లి, పెళ్లి అనే మాటలే ఎక్కువగా వినిపించాయి. విక్కీ కౌశల్-కత్రినా కైఫ్, రాజ్ కుమార్ రావ్-పత్రలేఖ

పెళ్లి చేసుకొబోతున్న బాలీవుడ్ బ్యూటీ.. డేట్ ఫిక్స్..

బాలీవుడ్‌లో గతేడాది ఎక్కడ చూసినా పెళ్లి, పెళ్లి అనే మాటలే ఎక్కువగా వినిపించాయి. విక్కీ కౌశల్-కత్రినా కైఫ్, రాజ్ కుమార్ రావ్-పత్రలేఖ, ఆదిత్య సీల్-అనుష్క రంజన్ తదితరులు 2021లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటను అనుసరిస్తూ మరికొంత మంది 2022లో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్టు బీ టౌన్ మీడియా తెలుపుతోంది. ‘ నాగినీ’  బ్యూటీ మౌనీరాయ్ ఈ ఏడాది జనవరి 27న పెళ్లి చేసుకొబోతున్నట్టు తెలుస్తోంది. దుబాయ్‌కి చెందిన బిజినేస్‌మేన్ సూరజ్ నంబియార్‌ను ఆమె పెళ్లాడబోతున్నట్టు సమాచారం. దుబాయ్‌లో ఈ జంట పెళ్లాడబోతుందని పుకార్లు షికార్లు చేశాయి. కానీ, వీరి వివాహం గోవాలోనే జరగబోతున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. 


‘‘ వివాహం కోసం ఫైవ్ స్టార్ రిసార్ట్‌ను బుక్ చేశారు. అందరికి శుభలేఖలు పంపించడం మొదలుపెట్టారు. పెళ్లికి హాజరు కాబోయే అతిథులెవరూ ఈ విషయాన్ని లీక్ చేయకూడదు. ఆ వేడుకలకు వచ్చే వారందరూ తప్పకుండా వ్యాక్సినేష‌‌న్ సర్టిఫికేట్స్‌ను తీసుకొని రావాలి ’’ అని మౌనీరాయ్‌కు సంబంధించిన వ్యక్తి చెప్పారు. ఈ జంట పశ్యిమ గోవాలోని వాగేటర్ బీచ్‌లో పెళ్లి చేసుకొబోతున్నట్టు తెలుస్తోంది. జనవరి 27న మధ్యాహ్నం పెళ్లి పీటలను ఎక్కబోతున్నట్టు సమాచారం. జనవరి 28న డ్యాన్స్ బాష్ ఏర్పాటు చేయాలని ఆ జంట భావిస్తున్నట్టు ఆంగ్లపత్రికల్లో కథనాలు వస్తున్నాయి. బీ టౌన్ సెలెబ్రిటీలైన కరణ్ జోహార్, ఏక్తా కపూర్, మనీశ్ మల్హోత్రా తదితరులకు ఆహ్వానాలు ఇప్పటికే అందాయట. తన బ్యాచిలరేట్ పార్టీని మౌనీరాయ్  గోవాలోనే ఇవ్వడం ఆస్తికరమైన విషయం.  



Updated Date - 2022-01-12T22:00:10+05:30 IST