Kodandarami Reddy: మంచి కథతో వస్తున్న సినిమా.. బిగ్ హిట్ అవ్వాలి

ABN , First Publish Date - 2022-08-31T04:59:45+05:30 IST

రాజ‌ధాని ఆర్ట్ మూవీస్, జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ బ్యానర్లపై తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ హీరోహీరోయిన్లుగా.. వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యంలో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు సంయుక్తంగా

Kodandarami Reddy: మంచి కథతో వస్తున్న సినిమా.. బిగ్ హిట్ అవ్వాలి

రాజ‌ధాని ఆర్ట్ మూవీస్, జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ బ్యానర్లపై తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ హీరోహీరోయిన్లుగా.. వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యంలో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 2న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు కోదండ రామిరెడ్డి, సాగర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ వంటి వారు ముఖ్యఅతిథులుగా హాజరై..చిత్రయూనిట్‌కు ఆశీస్సులు అందించారు.


అనంతరం దర్శకుడు కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ.. అందరూ కొత్తవారితో తీసిన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ చాలా బాగున్నాయి. ఈ సినిమాకు నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేసినట్లనిపిస్తుంది.. సినిమా కూడా బాగుంటుందనుకుంటున్నాను. మంచి కథతో వస్తున్న ఈ సినిమా నిర్మాతలకు బిగ్ హిట్ అవ్వాలని అన్నారు. ప్రేక్షకులందరూ సెప్టెంబర్ 2న థియేటర్లకు వచ్చి సినిమా చూసి యూనిట్‌ను ఆశీర్వదించాలని కోరుతున్నానని దర్శకుడు సాగర్ అన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. టికెట్స్ రేట్స్ పెంచి నిర్మాతలు ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో వచ్చిన బింబిసార, సీతారామం, కార్తికేయ సినిమాలు ఇండస్ట్రీకి ఊపిరి పోశాయి. మళ్లీ అలాంటి మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నాను. ఈ చిత్రానికి అందరూ ఎంతో కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్, నందమూరి హరికృష్ణ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న విడుదల అవుతున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌ ముల్లేటి నాగేశ్వ‌రావు మాట్లాడుతూ.. ప్రి రిలీజ్ వేడుకకు వచ్చి.. ఆశీర్వదించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. గణేష్  మాస్టర్ ఇందులో యాక్టింగ్‌తో పాటు ఐదు పాటలకు కొరియోగ్రఫీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. అది నేను చూశాను. మా అమ్మాయిని ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం చేస్తున్నాను. ఈ సినిమా తర్వాత త్వరలో ప్రియతమ్ దర్శకత్వంలో ఇంకో సినిమా చేయబోతున్నాం. తను ఇలాగే మంచి సినిమాలు నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెప్టెంబర్ 2న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆశీర్వాదించాలని కోరుతున్నానని అన్నారు. చిత్ర నిర్మాత ముల్లేటి క‌మ‌లాక్షి మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మా నాన్నే నాకు స్ఫూర్తి. సినిమా కష్టమేంటో నాకు తెలియాలని ఈ సినిమా ద్వారా నన్ను నిర్మాతగా పరిచయం చేస్తున్నాడు. అందుకు మా తల్లితండ్రులకు పాదాభివందనాలు. చిత్ర దర్శకుడు వెంకట్‌గారు సెలెక్ట్  చేసుకొన్న కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. అలాగే పెద్దలు తనికెళ్ళ భరణి‌గారు, జీవాగారు.. ఇలా అందరూ బాగా సపోర్ట్ చేయడం వల్లే సినిమా బాగా వచ్చింది. సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.. ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే రోజున థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రాన్ని ఆయన అభిమానులు ఆదరించాలని కోరుతున్నట్లుగా చిత్ర దర్శకుడు తెలిపారు.

Updated Date - 2022-08-31T04:59:45+05:30 IST