‘నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా’ ట్రైలర్ వదిలిన B Gopal

ABN , First Publish Date - 2022-08-24T02:20:46+05:30 IST

జివిఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై ‘హుషారు’ ఫేమ్ తేజ్ కూర‌పాటి (Tej Kurapati), అఖిల ఆక‌ర్ష‌ణ (Akhil Akarshana) జంట‌గా వెంక‌ట్ వందెల (Venkat Vandela) ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం

‘నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా’ ట్రైలర్ వదిలిన B Gopal

జివిఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై ‘హుషారు’ ఫేమ్ తేజ్ కూర‌పాటి (Tej Kurapati), అఖిల ఆక‌ర్ష‌ణ (Akhila Akarshana) జంట‌గా వెంక‌ట్ వందెల (Venkat Vandela) ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా’ (Na Venta Paduthunna Chinnadevadamma). ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యంలో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 2న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న సందర్భంగా.. తాజాగా చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు బి. గోపాల్ (B Gopal) చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.


ట్రైలర్ విడుదల అనంతరం దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా టైటిల్, సాంగ్స్, ట్రైలర్ అన్ని బాగున్నాయి. ఈ సినిమాకు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ  చాలా  హార్డ్ వర్క్ చేశారు. ఈ కథపై ఉన్న నమ్మకంతో దర్శకుడు వెంకట్ చాలా కాన్ఫిడెంట్‌గా తీశాడు. అలాగే ఈ సినిమా కథను, దర్శకుడిని నమ్మి తీసిన నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి. యూనిట్‌కు నా శుభాకాంక్షలు అని తెలపగా.. మరో సీనియర్ దర్శకుడు సాగర్ మాట్లాడుతూ.. పాటలన్నీ బాగున్నాయి. ట్రైలర్ కూడా చాలా బాగుంది. సెప్టెంబర్ 2న థియేటర్‌కు వచ్చి సినిమా చూసి అశీర్వదించాలని ప్రేక్షకులని కోరుకుంటున్నానని అన్నారు.


చిత్ర దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ.. ట్రైలర్ విడుదల చేసి ఆశీర్వదించిన పెద్దలకు ధన్యవాదాలు. నేను చెప్పిన కథ నచ్చగానే  ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న నిర్మాతలకు ధన్యవాదములు. ఇది ఒక అందమైన రియలిస్టిక్ ప్రేమ కథ. ఓసో లోని తత్వం, బుద్ధునిలోని సహనం, శ్రీ శ్రీలోని రేవలిజం, వివేకానందుడిలోని పరిపూర్ణమైన వ్యక్తిత్వం వుండేలా.. ఈ సినిమాలో తనికెళ్ళ భరణిగారి పాత్రను డిజైన్ చేయడం జరిగింది. ఇంకా ఇతర పాత్రలు కూడా ఎంతో బాగుంటాయి. మంచి టెక్నిషీయన్స్ కుదిరారు. వారందరికీ ధన్యవాదాలు. ఇంకా సహకరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిన్నాడిని ఆదరించాలని కోరుతున్నానని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. సినిమా బాగా వచ్చిందని.. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని తెలిపారు.

Updated Date - 2022-08-24T02:20:46+05:30 IST