Darja: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వదిలిన మూడో సాంగ్

ABN , First Publish Date - 2022-05-03T03:07:05+05:30 IST

కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas) సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్ (Sunil), అనసూయ (Anasuya) ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న

Darja: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వదిలిన మూడో సాంగ్

కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas) సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్ (Sunil), అనసూయ (Anasuya) ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’ (Darja). సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి (Sivasankar Paidipati) నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. తాజాగా చిత్రంలోని మూడో పాటని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. పాట విడుదల అనంతరం నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ‘‘ ‘దర్జా’ చిత్రంలోని మూడో పాటను విడుదల చేయడం జరిగింది. పాట చాలా బాగుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు.


ఈ సందర్భంగా కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి (Ravi Paidipati) మాట్లాడుతూ.. ‘‘మా ‘దర్జా’ చిత్రంలోని మూడో సింగిల్‌ ‘నీలి నీలి మేఘమా’ను విడుదల చేసి, ఆశీస్సులు అందించిన అపజయ మెరుగని నిర్మాణ సంస్థగా.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ భారీ చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని గారికి మా టీమ్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇటీవల మోషన్ పోస్టర్‌ని యాక్షన్ కింగ్ అర్జున్ (Action King Arjun), టీజర్‌ని నిర్మాత సురేష్ బాబు (Suresh Babu), ఫస్ట్ సింగిల్‌ని దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao), రెండో సింగిల్‌ని అల్లు అరవింద్‌(Allu Aravind) వంటి వారు విడుదల చేశారు. వారిచ్చిన సపోర్ట్‌కి ఈ సందర్భంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే  కామినేని శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాకి ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పని చేశారు. రాప్‌రాక్ షకీల్‌గారు అద్భుతమైన పాటల్ని ఇచ్చారు. ఇప్పటి వరకు మూడు పాటలు విడుదలయ్యాయి. ఇంకా రెండు పాటలున్నాయి. వాటిని కూడా త్వరలోనే విడుదల చేస్తాము..’’ అని తెలిపారు.

Updated Date - 2022-05-03T03:07:05+05:30 IST