మే 20న ‘ముత్తునగర్‌ పడుకొలై’ streaming

ABN , First Publish Date - 2022-05-19T17:51:02+05:30 IST

ముత్తునగర్‌ పడుకొలై’ (Muthunagar padukolai) తమిళ డాక్యుమెంటరీ సినిమా ఈ నెల 20వ తేదీన ఓ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో స్ట్రీమింగ్‌కానుంది. 2017లో జనవరిలో జరిగిన జల్లికట్టు పోటీలపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగింది.

మే 20న ‘ముత్తునగర్‌ పడుకొలై’ streaming

‘ముత్తునగర్‌ పడుకొలై’ (Muthunagar padukolai) తమిళ డాక్యుమెంటరీ సినిమా ఈ నెల 20వ తేదీన ఓ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో స్ట్రీమింగ్‌కానుంది. 2017లో జనవరిలో జరిగిన జల్లికట్టు పోటీలపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగింది. దీన్ని నాచ్చియాళ్‌ ఫిలిమ్స్‌ (Nachiyal Films) అనే సంస్థ ‘మెరీనా పురట్చి’ (Mereena puratchi) పేరిట ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా తెరకెక్కించింది. ఎం.ఎస్.రాజ్‌ (MS Raj) దర్శకత్వం వహించారు. అనేక ఆటంకాలను అధిగమించి సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నార్వే, కొరియా వంటి ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. 


ఇపుడు దరువై టాకీస్‌ (Daruvai Talkies) అనే సంస్థతో కలిసి నాచ్చియాళ్‌ ఫిలిమ్స్‌ (Nachiyal Films)   2018 మే 22, 23 తేదీల్లో తూత్తుక్కుడి స్టెరిలైట్‌ (Strilite) కర్మాగారానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల ఘటనను ఇతివృత్తంగా తీసుకుని ‘పెరల్‌సిటి మాస్‌కేర్‌’ (మత్తునగర్‌ పడుకొలై’) (Muthunagar padukolai)  అనే చిత్రాన్ని ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ (Investigative Documentary Film) గా దర్శకుడు ఎం.ఎస్.రాజ్‌ (MS Raj) తెరకెక్కించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఈ తుపాకీ కాల్పుల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఈ సినిమాను చూపించాం. వారంతా కన్నీటితో చిత్ర బృందాన్ని అభినందించారు. ముఖ్యంగా మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేయాలన్న కోరుతూ సంతకాల సేకరణ కూడా చేపట్టారు. ఈ సంతకాల జాబితాను ప్రభుత్వానికి సమర్పిస్తాం’ అని తెలిపారు.  

Updated Date - 2022-05-19T17:51:02+05:30 IST