Harsh More: మార్పులతో కూడిన ‘బ్రహ్మాస్త్ర’ సాంగ్ నెట్టింట వైరల్

ABN , First Publish Date - 2022-07-25T00:49:42+05:30 IST

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌గా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 1: శివ’ (Brahmastra Part 1: Shiva). అయాన్ ముఖర్జీ దర్శకత్వం

Harsh More: మార్పులతో కూడిన ‘బ్రహ్మాస్త్ర’ సాంగ్ నెట్టింట వైరల్

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌గా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 1: శివ’ (Brahmastra Part 1: Shiva). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రం పాన్ ఇండియాగా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా జులై 17న ‘కేసరియా’ పాటను విడుదల చేసింది. ఈ సాంగ్ నెట్టింట సంచలనంగా మారింది. కానీ, కొంత మంది నెటిజన్స్ మాత్రం రెండుగా విడిపోయారు.


‘బ్రహ్మాస్త్ర’ లోని ‘కేసరియా’ పాటతో నెటిజన్స్ రెండుగా చిలీపోయారు. అందుకు కారణం ఏంటంటే ఈ పాటలోని ‘లవ్ స్టోరియా’ పదం. దీంతో కొంత మంది మ్యూజిషియన్స్ ఆ పదం లేకుండా పాటను పాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. తాజాగా మ్యూజిషియన్ హర్ష్ మోరే (Harsh More) ఈ విధంగానే పాటను ఆలపించి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ‘మార్పులతో కూడిన కేసరియా సాంగ్ మీ కోసం’ అని హర్ష్ క్యాప్షన్ ఇచ్చాడు. ఐదు రోజుల క్రితం వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 12.7మిలియన్స్ మంది వీక్షించారు. 12లక్షల మంది లైక్ చేశారు. మరికెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.. 



Updated Date - 2022-07-25T00:49:42+05:30 IST