ఏఆర్. రెహమాన్ అభ్యర్థనకు ఇళయరాజా అంగీకారం

Twitter IconWatsapp IconFacebook Icon
ఏఆర్. రెహమాన్ అభ్యర్థనకు ఇళయరాజా అంగీకారం

తన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి ఏఆర్. రెహమాన్. సంగీతానికి సరిహద్దులు లేవని ఆయన నిరూపించారు. ప్రపంచ వేదికలపై భారత మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించారు. నాలుగు దశాబ్దాలుగా సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న వ్యక్తి ఇళయ రాజా. భారత్‌కు చెందిన ఈ ఇద్దరు సంగీత దిగ్గజాలు త్వరలోనే కలిసి పనిచేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఇళయ రాజాతో తీసుకున్న ఫొటోను రెహమాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


రెహమాన్‌కు దుబాయ్‌లో ‘ఫిరదౌస్’ అనే స్టూడియో ఉంది. ఈ స్టూడియోను ఇళయరాజా సందర్శించిన సందర్భంగా ఆయనతో ఏఆర్. రెహమాన్ ఓ ఫొటోను తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘మా ‘ఫిరదౌస్’ స్టూడియోకు ఇళయరాజాకు స్వాగతం పలికినందుకు సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఆయన మా అర్కెస్ట్రాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని రెహమాన్ ట్విట్టర్‌లో ఓ మెసేజ్ షేర్ చేశాడు. ఆ మెసేజ్‌కు ఇళయ రాజా రిప్లై ఇచ్చాడు. ‘‘నీ అభ్యర్థనను అంగీకరించాను. త్వరలోనే కంపోజింగ్ మొదలుపెడతాను’’ అని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. గతంలో రెహమాన్ తండ్రి శేఖర్‌తో కలిసి ఇళయ రాజా పని చేశారు. ఆయన సంగీతం అందించిన అనేక చిత్రాలకు రెహమాన్ కీ బోర్డ్ ప్లేయర్‌గా సేవలు అందించారు. ఈ ఇద్దరు సంగీత దిగ్గజాల మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో అనేక వార్తలు వచ్చాయి. కానీ, రెహమాన్ అభ్యర్థనకు ఇళయ రాజా అంగీకారం తెలపడంతో ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. 


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.