సంగీతమే అన్నింటికీ మందు అంటోన్న దర్శక ద్వయం

ABN , First Publish Date - 2022-01-14T03:14:34+05:30 IST

అన్ని వ్యాధులకు సంగీతమే సరైన మందు అని కోలీవుడ్‌ యువ సంగీత దర్శక ద్వయం వివేక్‌ - మెర్విన్‌ అంటున్నారు. ప్రధానంగా సంగీతానికి మానవ భావోద్వేగాల నుంచి ఉపశమనం కలిగించే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని అంటున్నారు. తాజాగా

సంగీతమే అన్నింటికీ మందు అంటోన్న దర్శక ద్వయం

అన్ని వ్యాధులకు సంగీతమే సరైన మందు అని కోలీవుడ్‌ యువ సంగీత దర్శక ద్వయం వివేక్‌ - మెర్విన్‌ అంటున్నారు. ప్రధానంగా సంగీతానికి మానవ భావోద్వేగాల నుంచి ఉపశమనం కలిగించే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని అంటున్నారు. తాజాగా ఈ సంగీత ద్వయం దర్శకత్వం వహించిన ‘ఎన్న సొల్ల పోగిరాయ్‌’ చిత్రం సంక్రాంతిని పురస్కరించుకుని ఈ నెల 13వ తేదీ విడుదలైంది. అశ్విన్‌ కుమార్‌ లక్ష్మీకాంతన్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి వివేక్‌ - మెర్విన్‌ సంగీతం సమకూర్చారు. 


ఇదే విషయంపై ఈ సంగీత ద్వయం మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ చిత్ర ఆడియో మంచి విజయం సాధించింది. ఇందులోని పాటలన్నీ ప్రేక్షకుల నోళ్ళలో నానుతున్నాయి. ఇందులోని సంగీతం ప్రేక్షకుల మనసులను హత్తుకుని.. ఈ మహమ్మారి సమయంలో ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ఇందులోని ప్రతి పాట మన జీవితంలో ప్రతి దశలోనూ హృదయానికి దగ్గరగా, సందోర్భచితంగా ఉంటాయి అని వివరించారు. కాగా, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై నిర్మాత ఆర్‌.రవీంద్రన్‌ నిర్మించగా, హరిహరన్‌ దర్శకత్వం వహించారు. అవంతికా మిశ్రా, తేజు అశ్వినిలు హీరోయిన్లుగానూ, పుగళ్‌ ఓ కీలక పాత్రలో నటించారు.

Updated Date - 2022-01-14T03:14:34+05:30 IST