సీనియర్‌ సంగీత దర్శకుడు ఎస్వీ రమణన్‌ మృతి

ABN , First Publish Date - 2022-09-27T15:36:25+05:30 IST

ప్రముఖ సంగీత, సినీ దర్శకుడు ఎస్వీ రమణన్‌ (87) సోమవారం ఉదయం మృతి చెందారు. దివంగత తమిళ సినీ సంగీత దిగ్గజం కే సుబ్రమణ్యం

సీనియర్‌ సంగీత దర్శకుడు ఎస్వీ రమణన్‌ మృతి

చెన్నై, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సంగీత, సినీ దర్శకుడు ఎస్వీ రమణన్‌ (87) సోమవారం ఉదయం మృతి చెందారు. దివంగత తమిళ సినీ సంగీత దిగ్గజం కే సుబ్రమణ్యం కుమారుడైన రమణన్‌ మొదట రేడియో నాటకాలకు సంగీత దర్శకుడిగా పనిచేసేవారు. ఆ తర్వాత భగవాన్‌ రమణమహర్షి, షిరిడి సాయిబాబా జీవిత విశేషాలతో డాక్యుమెంటరీలు రూపొదించారు. తమిళంలో ‘ఉరువంగళ్‌ మారలామ్‌’; ‘విశ్వనాధన్‌ వేలైవేండుమ్‌’ అనే చలనచిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. కొన్ని తమిళ చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ఆయనకు భామా అనే భార్య, సరస్వతి, లక్ష్మీ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో లక్ష్మిని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సోదరుడు రవి రాఘవేంద్ర వివాహం చేసుకున్నాడు.

  ఆ దంపతుల కుమారుడే వర్థమాన సినీ సంగీత దర్శకుడు అనిరుధ్‌. అంటే ఎస్వీ రమణన్‌ అనిరుధ్‌కు తాత అవుతారు. అంతే కాకుండా ఎస్వీ రమణన్‌ సోదరి ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మాసుబ్రమణ్యం. స్థానిక రాజా అన్నామలైపురంలో నివసిస్తున్న రమణన్‌ గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతుండేవారు. ఆయన అంత్యక్రియలు సోమవారం సాయంత్రం బీసెంట్‌నగర్‌ శ్మశానవాటికలో జరిగాయి.

Updated Date - 2022-09-27T15:36:25+05:30 IST