ముసలోడికి దసరా పండగ

ABN , First Publish Date - 2022-05-26T06:36:27+05:30 IST

నాజర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ముసలోడికి దసరా పండగ’. అంజలి, అనిత, కోవై సరళ, శరణ్య, సత్య ముఖ్యపాత్రల్లో నటించారు...

ముసలోడికి దసరా పండగ

నాజర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ముసలోడికి దసరా పండగ’. అంజలి, అనిత, కోవై సరళ, శరణ్య, సత్య ముఖ్యపాత్రల్లో నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డి మనోహర్‌ దర్శకత్వంలో రమణ వాళ్లె నిర్మించారు. ఈ చిత్రం పోస్టర్‌, ట్రైలర్‌ను నాజర్‌ విడుదల చేశారు. ‘ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. సినిమా మంచి విజయం సాధించాలి’ అని ఆయన ఆకాంక్షించారు. నిర్మాత మాట్లాడుతూ ‘రెండు గంటలసేపు ప్రేక్షకులు అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఉంటుంది. నా తండ్రిసమానులైన దర్శకుడు దివంగత ఈవీవీ సత్యనారాయణగారికి ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నామ’న్నారు. ఈ చిత్రానికి డి. ఇమాన్‌  సంగీతం అందించారు. 


Updated Date - 2022-05-26T06:36:27+05:30 IST